సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న సమంత, ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. టాలీవుడ్ లో వరుస మూవీలు చేసి, ఇతర హీరోయిన్స్ కి అవకాశాలు రాకుండా చేసిన ఈ హీరోయిన్, ఇక్కడ అవకాశాలు తగ్గటంతో...వెంటనే తన స్కిన్ ఫార్ములాని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూపుతుంది.

దీంతో సమంత స్మైల్ కి ఫిదా అయినా కోలీవుడ్ హీరోయిజం...సమంత కి వరుస ఆఫర్స్ ఇస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే ఫుల్ డిమాండ్ తో ఉన్నారు. వారిలో రెండో లిస్ట్ లో శ్రుతిహాసన్ ఉంటే, మొదట లిస్ట్ మాత్రం సమంతనే టాప్. ఇదిలా ఉంటే, హైఫై సొసైటీలో వారి కంటూ ఓ ప్రత్యేకమైన ఫేమ్ క్రియేట్ అయిన తరువాత, వారికి రకరకాల వాటిపై ఆసక్తి పెరుగుతుంటాయి.

ఆ విధంగా తాజాగా సమంత సైతం టాటూలపై మనుసు పారేసుంది. ఇప్పటి సమంత ఒంటిపై ఓ టాటూ కనిపిస్తుంది. ఇప్పుడు మరో టాటూను సమంత తన స్కిన్ పై చోటుని కల్పిస్తుంది. తను రీసెంట్ గా అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అక్కడ ఓ అమ్మాయి తన ఒంటిపై వేసుకున్న టాటూ, సమంతని తెగ ఇంప్రెస్ చేసిందట.

ఆ అమ్మాయికి నడుము భాగంలో కనిపించే ఆ టాటూ...కనిపించీ కనిపించనట్టుగా అందరి కళ్ళూ తిప్పుకోనివ్వటం లేదంట. ఆ విధమైన ఎట్రాక్షన్ అనేది సమంతని తెగ ఇంప్రెస్ చేసింది. ఇంకే తను కూడ అలాంటి డిజైనింగ్ టాటూనే తన నడుము భాగంగా వేసుకోవాలని నిర్ణయించుకుంది. త్వరలో తను టాటూలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: