టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును పడగొట్టడానికి ఒక అంతర్జాతీయ కంపెనీ 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ ను మహేష్ ఒప్పుకుంటే టాలీవుడ్ లో ఇలాంటి భారీ ఆఫర్ అందుకున్న టాప్ హీరోగా మహేష్ మరో కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన వాడు అవుతాడు.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రముఖ అంతర్జాతీయ సినిమా నిర్మాణ సంస్థ ఈరోస్ ఈ ఆఫర్ ను మహేష్ ముంగిట పెట్టింది అని టాక్. ‘శ్రీమంతుడు’ సినిమాను 70 కోట్లకు కొనుక్కున్న ఈ సంస్థ ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ హోరుతో ఫిదా అయిపోవడంతో ఈసారి మహేష్ ను ఏకంగా 3 సినిమాలకు తమ సంస్థ బందీగా మార్చుకోవడానికి ఈ ప్లాన్ రూపొందిoచినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాల పై కూడ హక్కులు పొంది ఘోరమైన ఫ్లాప్ లు చూసిన ఈరోస్ ‘శ్రీమంతుడు’ ఇచ్చిన జోష్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈరోస్ విడుదల చేసే మూడు సినిమాలలో ఒక సినిమా మహేష్ నటించబోయే బాలీవుడ్ సినిమా కూడ ఉండాలని కండిషన్ పెడుతున్నట్లు టాక్.
అంతేకాదు మహేష్ ను బాలీవుడ్ స్టార్ గా ప్రమోట్ చేసే బాధ్యత కూడ ఈ సంస్థ తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మహేష్ కు బాలీవుడ్ సినిమాలలో ప్రస్తుతం నటించే ఉద్దేశ్యం లేకపోవడంతో పాటు ఒకే సంస్థకు బందీగా వరసగా 3 సినిమాలు చేసి పెట్టడం ఎంత వరకు శ్రేయస్కరం అన్న ఆలోచనల మధ్య ప్రిన్స్ ఉండటంతో ఈ డీల్ ప్రస్తుతానికి సస్పెన్స్ తో కొనసాగుతోంది అని అంటున్నారు. మహేష్ త్వరలో నటించబోతున్న ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ విషయమై ఒక క్లారిటీ రావచ్చు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: