తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలా పల్లెటూళ్లలో మన తెలుగింటి అమ్మాయిలు ఇలానే ఉంటారా అన్నంతగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కనిపించింది అంజలి.  ఈ అమ్మడిది తూర్పు గోదావరి జిల్లా.. పదవ తరగతి వరకు అక్కడే చదివింది.. మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి.అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన 'డేర్'.తర్వాత 2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ'లో అవకాశం ఇచ్చారు.

2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది.2013లో మళ్లీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు. ఇక రవితేజ సరసన బలుపు చిత్రంలో నటించింది. ఇక్కడ కాస్త ఆఫర్లు తక్కువ కాగానే తమిళ ఇండస్ట్రీకి జంప్ అయ్యింది. అంజలి మొదటి నుంచి వివాదాస్పద వార్తల్లో ఎక్కువ ఉంటూ వచ్చింది.

అంజలి


ఆ మద్య దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అంజలి చెల్లెలు ఆరాధ్య హీరోయిన్‌గా అరంగేట్రం చేయబోతోందంటూ టాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అంజలి ఖండించింది. ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్‌’లో నటిస్తున్న అంజలి షూటింగ్‌ నిమిత్తం బల్గేరియాలో ఉంది. సామాజిక మాధ్యమం ద్వారా చెల్లెలి అరంగేట్రం వార్త గురించి తెలుసుకున్న అంజలి తన మేనేజర్‌ ద్వారా పత్రికా ప్రకటన విడుదల చేసింది...  తనకు ఇద్దరు అన్నలు, ఒక అక్క మాత్రమే ఉందని ఆమెకు కూడా పెళ్లయ్యిందని.. , త్వరలో బిడ్డ కూడా పుట్టబోతున్నాడు. దయచేసి ఈ వార్తలను నమ్మద్దు’ అని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: