ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్య అనుష్క జంటగా నటిస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో కీరవాణి ఓ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారని న్యూస్. ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలోని సన్నజాజి పడక అనే సాంగ్ ని ‘సైజ్ జీరో’ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారట. కమల్ హాసన్, రేవతిల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ అప్పట్లో శ్రోతలను బాగా ఆకట్టుకుంది. సన్నజాజి పడక.. అంటూ సాగే ఈ సాంగ్ ని పాడింది బాలు, జానకిలు.

 

జానకమ్మ ఏ వేదిక మీదైనా పాడి వినిపించే ఈ సాంగ్ ని మళ్లీ రీ మిక్స్ చేయడం సంతోషించ దగ్గ విషయం. అయితే రొమాంటిక్ గా సాగే ఈ సాంగ్ ‘సైజ్ జీరో’లో కూడా ఆర్య అనుష్కల మధ్య మంచి ఘాటైన లిప్ లాకులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రకాశ్. రిలీజ్ అయిన ట్రైలర్లు, పోస్టర్లతో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ‘సైజ్ జీరో’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  

 

సైజ్ జీరోలో ఆర్య అనుష్క:

 

లావుగా ఉన్న అమ్మాయిలూ ఆలోచన ధోరణి వారి ప్రవార్తన ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నాడు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. అనుష్క అందాలను ఎరగా వేస్తున్న ప్రకాశ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

 

సెప్టెంబర్ 6న ఆడియో వేడుక జరుపుకోనున్న సైజ్ జీరో సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్లో పరం.వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.  

 

క్షత్రియ పుత్రుడు సినిమాలో ఒరిజినల్ సాంగ్ మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: