చిరంజీవి తన 150వ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో క్లారిటీ లేకపోయినా అతడి ఇంటికి అదృష్టం కలిసి వచ్చి నడిచి వస్తున్న 500 కోట్ల వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. చిరంజీవి అతడి కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న మాటివి ని స్టార్ టివి కొన్న విషయం ఎప్పుడో బయటకు వచ్చింది. 

స్టార్ టివి, మాటివి ఛానల్ ను 2, 500 కోట్లకు కొన్న నేపధ్యంలో ఈ సంస్థలో 20% వట ఉన్న చిరూ కుటుంబానికి ఈ వ్యవహారం ద్వారా 500 కోట్లు చిరంజీవి కుటుంబానికి తమ మాటివి షేర్ల అమ్మకం ద్వారా లభించబోతోంది అన్న వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

ఇప్పటికే మాటివిని కొనుకున్న స్టార్ టీవీ సంస్థ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ ఐ పీ బీ)కి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ దరఖాస్తుకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం కూడా లభించింది అని ఫిలింనగర్ లో మాటలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే మా టివిని స్టార్ టివి యాజమాన్యం టేక్ ఓవర్ చేసే అధికారిక ప్రక్రియ మొదలు అవుతుంది అని టాక్. 

తన 150వ సినిమా ద్వారా 100 కోట్ల కలక్షన్స్ ను చిరంజీవి ఎప్పుడు అందుకుంటాడో తెలియదు కాని చిరంజీవి ముoగిట మాత్రం 500 కోట్ల అదృష్ట లక్ష్మి తాండవం చేయడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే మాటివి సంస్థలో నాగార్జునకు కూడ 10 శాతం షేర్లు ఉన్న నేపధ్యంలో నాగ్ కు ఈవివ్యవహారంలో 250 కోట్ల వరకు లాభం వస్తుందని మరొక వార్త కూడ బయటకు వస్తోంది. ఏమైనా రాజకీయాలలో రాణించ లేకపోయినా చిరంజీవి అదృష్ట లక్ష్మి మాత్రం మెగా స్టార్ పై వందల కోట్లను కురిపించడం నేటి హాట్ టాపిక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: