తెలుగు ఇండస్ట్రీలో  సినిమా దర్శకుడు,రచయిత మరియు సినీ నిర్మాతగా, నటుడిగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు దాసరి నారాయణరావు. ఈయన   ద్వారానే కొంతమంది హీరోలు, హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు...ఇప్పుడు టాప్ పోజిషన్లో ఉన్నారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు.తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.


 తాజాగా దాసరి ఒక దర్శకుడిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. మరి ఆ దర్శకులు ఎవరా అనుకుంటున్నారా..? ఈ మద్య టెంపర్ సినిమాతో అందరినీ అలరించిన దర్శకులు పూరీ జగన్నాధ్. దర్శకులు దాసరి నారాయణ రావు సినిమా ఇండస్ట్రీ లో హీరో ల స్థాయిని జీరో స్థాయికి పడేసి దర్శకులు పూరీ జగన్నాధ్ అన్నారు..  తెలుగు సినిమాగతి తప్పడానికి పూరి జగన్నాద్ కారణమంటూ దాసరి నారాయణరావు విమర్శలు కురిపించాడు. ఆయన తీసిన సినిమా ‘ఇడియట్’ సినిమాతో హీరోల నటనలో పెను మార్పులే వచ్చాయి.. ఒకప్పుడు ఫ్యామిలీతో సినిమాకు వెళితే.. అందరూ చక్కగా కూర్చొని ప్రశాంతంగా సినిమాను ఆస్వాదించే వారు. ఇప్పుడు హీరోలు హీరోల బాడీ లాంగ్వేజ్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


దర్శకులు పూరీ జగన్నాధ్


అప్పట్లో హీరో అంటే ఊరి కోసం ,జనం కోసం ఆదర్శంగా ఉండేవాళ్ళు.. అన్యాయాలను అక్రమాలను అరికట్టడానికి హీరో ఉంటాడు అనే స్థాయిలో ఉండేది.. కానీ  పూరి సినిమాల్లో హీరో పాత్ర వంకర గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్ ని ఏడిపించడం ,తల్లిదండ్రులను లెక్క చేయకుండా మాట్లాడే హీరోలు అతని సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. ఇక పూరీ సినిమాల్లో వెపన్స్ వాడకాలు బాగా ఉంటాయని గన్ కల్చర్ ఇలాంటి సినామలు బాగా ప్రేరేపిస్తాయని విమర్శించారు. ఒకప్పుడు దాసరి నారాయణ రావు ఇండస్ట్రీలో తన వారసుడు ఎవరా అంటే పూరీ జగన్నాధ్ అని అందరిముందూ అన్నారు..మరి ఇప్పుడు ఇంత సీరియస్ కావడానికి గల కారణాలు మిటో మరీ..చూడాలి పూరి ఈ విషయం ఎలా స్పందిస్తారో….!

మరింత సమాచారం తెలుసుకోండి: