తన పుట్టినరోజు సంబరాలకు కూడ అందుబాటులో లేకుండా దూరంగా ఉన్న పవన్ నితిన్ ఒత్తిడికి లొంగిపోతాడా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్త పరుస్తున్నారు. ఈనెలలో 20న అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజునాడు జరగబోతున్న అఖిల్ ఆడియో ఫంక్షన్ చాలా భారీస్థాయిలో ఏర్పాటు చేయడానికి నితిన్ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈఆడియో వేడుకకోసం ఒక స్పెషల్ సెట్ ను డిజైన్ చేయడమే కాకుండా బాలీవుడ్ కు సంబంధించిన కొంతమంది సెలబ్రిటీను ఈ ఆడియో వేడుకకు వచ్చే విధంగా అప్పుడే నితిన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు అనే వార్తలు కుడా వస్తున్నాయి. అయితే ఈసినిమాఫంక్షన్ కు  మరింత క్రేజ్ తీసుకు రావడానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ ను ఒప్పిచడానికి నితిన్ తన సర్వ శక్తులు ఒడ్డి తన ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికీ నితిన్ తన కోరికను పవన్ ముందు వ్యక్తపరిచాడని అయితే పవన్ నుంచి నెగిటివ్ రిప్లై రాక పోవడంతో ఏదోవిధంగా తన కోరికకు పవన్ ఒప్పుకుంటాడని గంపెడు ఆశల పై నితిన్ ఉన్నట్లు టాక్. అయితే  తన ఫ్యామిలీ  హీరోల ఆడియో ఫంక్షన్లకే డుమ్మాకొట్టే పవన్ నితిన్ పిలిస్తే ఎక్కడ వస్తాడు అని చాలా మంది కామెంట్ చేస్తున్నా ఆ కామెంట్స్ పట్టించుకోకుండా నితిన్ తన వంతు గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడిప్పుడే తిరిగి మెగా కుటంబానికి దగ్గర అవుతున్న పవన్ ఇటువంటి సాహసం చేసే అవకాశాలు తక్కువే అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. మరి దేముడు ఇచ్చిన తమ్ముడు కోరిక పై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: