పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీని డైరెక్ట్ చేసే ఆఫర్ అంటే ఏ దర్శకుడైనా ఎగిరి గంతులేస్తాడు. ఆ విధంగానే గత కొంత కాలం క్రితం డైరెక్టర్ సంపత్ నంది, పవన్ మూవీ అంటే ఎగిరి గంతేసాడు. కాని అనుకోని కారణాల రీత్యా సంపత్ నంది ఆ మూవీ నుండి బయటకు వచ్చేశాడు. అలా బయటకు వచ్చిన సంపత్ నంది, మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ మూవీను తెరకెక్కిస్తున్నాడు. 

‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది,బెంగాల్ టైగర్ మూవీని పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది. చుట్టూ పోలీస్ సిబ్బంది గన్స్ రవితేజ మీదకు ఎయిమ్ చేసి ఉన్న ఈ ఫోటోలో రవితేజ తనదైన స్టైల్‌ తో అధరగొట్టాడు.

ఇదిలా ఉంటే బెంగాల్ టైగర్ మూవీలో దాదాపు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన పలు సీన్స్ ని చిత్రీకరించనట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే సర్ధార్ గబ్బర్ సింగ్ మవీకి సంబంధించిన స్క్రీన్ ప్లేను బెంగాల్ టైగర్ మూవీ కోసం సంపత్ నంది వాడుకున్నట్టు తెలుస్తుంది.  ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ మూవీ రిలీజ్ అనంతరం పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు బెంగాల్ టైగర్ మూవీలోని సీన్సే పవన్ మూవీలో కనిపించే అవకాశం ఉంది. దీంతో పవన్ మూవీకి కొంత మేర లాస్ జరగవచ్చని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ సంపత్ నంది రివేంజ్ ఈ విధంగా తీర్చుకుంటున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: