సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న బ్యూటీ అనుష్క. అవును, అనుష్కకి ఉన్న ఏజ్, అలాగే ప్రస్తుతం తనకి ఉన్న పర్సనాలిటీకి టాప్ హీరోయిన్ గా కొనసాగటం కష్టమే. కాని ఇప్పటికీ తన బాడీ ఫిట్ గా ఉండటానికి కారణం తను సాధన చేసిన యోగానే. అందుకే అందుకే తనకి అంతటి అందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాధించిన యోగాకి, ఎంతో కొంత న్యాయం చేయాలనుకుంటుంది.

దీంతో ఓ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అనుష్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్ధానికి పైగానే స్టార్ డం పొజిషన్ ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా అనుష్క ని హీరోయిన్ గా తీసుకోవటానికి ఇప్పటికీ స్టార్ హీరోలు క్యూలు కడుతూనే ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ కంటే అనుష్క చేతిలోనే ఎక్కువ మూవీల ఆఫర్స్ ఉన్నాయి.

ఏదైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది కామన్ పాలసీ. ఆ విధంగా అనుష్క తనకు ఫేం ఉన్నప్పుడు తన స్టార్ డం ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. తను త్వరలోనే ఓ యోగా వీడియోను మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని అనుకుంటుంది. తను ప్రత్యేకంగా సాధన చేసిన యోగా వీడియోలను షూట్ చేసి, వాటిని మార్కెట్ లోకి రిలీజ్ చేయాలనేది ప్లాన్.

అయితే ఆ వీడియో అనుష్క  మరింత హాట్ గా కనిపించే అవకాశం ఉందట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అనుష్క తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సైతం ఆ వీడియో కనిపించనున్నాడంట. అందుకే అనుష్క యోగా కాన్సెప్ట్ అధిరించదని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో అనుష్క యోగా వీడియోలను రిలీజ్ చేస్తే..ఎవరైనా కొనకుండా ఉండారా? అడ్వాన్స్ బుకింగ్ కాపీలన్నీ హాట్ హాట్ గా అమ్ముడవ్వవూ!


మరింత సమాచారం తెలుసుకోండి: