టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గెలిపించండి. ఇదేదో పొలిటికల్ ప్రచారం కాదండోయ్. రాజమౌళిని గెలిపించే అవకాశం ఆయన అభిమానులకు వచ్చింది. ఇటీవల రాజమౌళి 'సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియా-2012' అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే రాజమౌళికి ఈ అవార్డు దక్కడం దక్కక పోవడం అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ అవార్డుకు నామినేట్ అయిన వారిలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ ఎస్ఎంఎస్ ఓట్లు వస్తే వారికే అవార్డు దక్కుతుంది. మరి మన రాజమౌళికి ఈ అవార్డు దక్కాలంటే మన మద్దతు కావాలి. అందుకు మనం చేయాల్సిందల్లా... IENT 5 అని టైట్ చేసి 51818 అనే నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయడమే. ఏటా సీఎన్ఎన్-ఐబీఎన్ సంస్థ వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తుంది. ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో సౌతిండియా నుంచి ఒక్క రాజమౌళి మాత్రమే నామినేట్ అయ్యాడు. ఈగ సినిమాకు గాను రాజమౌళి ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ కేటగిరిలో ఇంకా.. అమీర్ ఖాన్ అండ్ సత్యమేవ జయతే టీం, ఇర్ఫాన్ ఖాన్, రణబీర్ కపూర్, శ్రీదేవి, విద్యాబాలన్ కూడా నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరికి ఎస్ఎమ్ఎస్ ఓట్లు లభిస్తే వారికే అవార్డు దక్కుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: