ఆయన ఒకప్పుడు భారత దేశపు క్రికెట్ దిగ్గజం..బరిలోకి దిగాడంటే బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపేవాడు..కెప్టెన్ గా ప్రపంచ కప్ గెలుపొందడంలో ఎంతో బాధ్యత వహించిన  క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ను కలుసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కపిల్ దేవ్ తో కలిసి దిగిన ఫొటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు బన్నీ. కపిల్ దేవ్ నా సినిమాలు చూస్తానని చెప్పటం నాకు ఆశ్యర్చాన్ని కలిగించింది.  

కపిల్ దేవ్ తన ‘రేసు గుర్రం’ సినిమా తెగ నచ్చిందట..కపిల్ దేవ్ ఏంటి.. ఆయనకు రేసుగుర్రం నచ్చడమేంటి.. అస్సలు లింక్ కుదురుతున్నట్లు లేదు కదా. అల్లు అర్జున్ కూడా అలాగే ఆశ్చర్యపోయాడు. ఐతే సెట్ మ్యాక్స్ ఛానెల్లో వచ్చే సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ చూస్తానని చెప్పాడట కపిల్. అలా రేసుగుర్రం సినిమా చూశానని.. అందులో తన పెర్ఫామెన్స్ బాగుందని కితాబిచ్చాడట కపిల్. ఇంకేముంది స్టైలిష్ స్టార్ ఆనందానికి అవధులే లేవు ..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ను కలుసుకున్నారు.

 ‘రేసు గుర్రం’ సినిమా లో అల్లు అర్జున్


అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహరెడ్డి కపిల్దేవ్తో కలిసి దిగిన ఫొటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ. తాజాగా అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: