ఇళయదళపతి విజయ్ కోలీవుడ్లో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్ హీరో సినిమా పులి ఈరోజు ఉత్కంట పరిస్థితుల్లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమాను భారీగా రిలీజ్ చేద్దామనుకున్న దర్శక నిర్మాతల ఆలోచనలకు క్యూబ్ స్ట్రీమింగ్ వారు అడ్డుతగలడంతో సినిమాను ఆపేయాల్సి వచ్చింది. అదీగాక ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాతల ఇళ్ల మీద ఐటి శాఖా అధికారుల దాడి కూడా దీనికి కారణం కావొచ్చు. ఏది ఏమైనా బాహుబలి కంటే సూపర్ వసూళ్లను రాబడుతుంది అనుకున్న పులి కాస్త పిల్లి అయ్యి తోకముడిచిందని చెప్పొచ్చు. అయితే తమ అభినాన హీరో సినిమాను రిలీజ్ కాకుండా ఆపినందుకు పలు ప్రాంతాల్లో విజయ్ అభిమానులు ఆంధోళనలు చేపట్టారు.


అయితే విజయ్ కు ఇలా సినిమా రిలీజ్ కష్టాలు కొత్తవేమీ కాదు అప్పట్లో జిల్లా, కత్తి సినిమా కూడా రిలీజ్ కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడ్డది. సినిమా వారి మీద రాజకీయ ప్రభావం ఉండదు అంటూనే హీరోలను టార్గెట్ చేస్తున్నారు రాజకీయ పెద్దలు. అయితే విజయ్ చిన్న హీరో కాదు ఆయన సినిమా ఆపితే జరిగే పరిణామాలను కూడా అంచనా వేయగలిగి ఉండాలి. మరి ఈరోజు జరిగిన గొడవల్లో రెండు మూడు చోట్ల ప్రభుత్వ ఆస్థికి నష్టం కలిగించే చర్యలు చేపట్టారు ఇళయదళపతి అభిమానులు.


అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజయ్ పులి సినిమా ఇలా అనుకోని పరిణామాలను ఫేజ్ చేస్తుందని ఊహించి ఉండరు. కాని కొన్ని అదృశ్య శక్తుల వల్లే ఇలాంటి అనుకోని సంఘటనలు జరుగుతున్నాయనేది అసలు నిజం. మరి విజయ్ ఇలానే చూస్తూ ఉంటే తన ఇమేజ్ కి కూడా చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా తను దీనికి సంబధించిన వారితో మాట్లాడి ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడతాడని ఆశిస్తున్నారు.


సినిమా గొడవల వల్ల రిలీజ్ అయితే ఆ సినిమాకు రావాల్సిన ఓపెనింగ్స్ కూడా కష్టం గా వస్తాయి. అసలే బాహుబలితో పోల్చుకుని ఈ సినిమా అన్ని రికార్డులను అధిగమిస్తుందని రిలీజ్ కు ముందు తెగ గొప్పలు చెప్పుకున్నారు. మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మార్నింగ్ షో ఆపేసినా మధ్యాహ్నం నుండి సినిమా చెన్నైలో రిలీజ్ అయ్యింది పులి. ఇక తెలుగులో రేపటి నుండి థియేటర్లలో సందడి చేయనున్నది విజయ్ పులి.   


మరింత సమాచారం తెలుసుకోండి: