అవును నే తప్పు చేశాను.. అలాంటి సినిమాలో నటించినందుకు ఇలాంటి ఆఫర్లు వస్తాయనుకోవడం లేదు..అంటూ వాపోయింది హాట్ యాంకర్ ప్రశాంతి. బుల్లి తెరపై యాంకరింగ్ చేస్తున్న జాలీగా మాట్లాడే ఈ అమ్మడు చాలా హోమ్లీగా ఉండేది..  వంట కార్యక్రమాలతో ప్రేక్షకులకు రకరకాల రుచులను పరిచయం చేస్తూ దగ్గరయిన యాంకర్ ప్రశాంతి.   లాంగా వోణి వేసుకొని యాంకరింగ్ చేస్తూ ఈ  అమ్మడిని చూస్తే అచ్చు పదహారణాల తెలుగుమ్మాయిని చూసినట్లు అనిపించేది.  సినిమాలో చాన్స్ వస్తే ఎంత గ్లామర్ పాత్రలైనా వల్గర్ పాత్రలైనా సిద్దమనే ఈ కాంలంలో తనూ అదే బాట పట్టింది.

 ప్రశాంతి  'ఎఫైర్ ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇద్దరు అమ్మాయిల మద్య జరిగే ఇల్లీగల్ 'ఎఫైర్ ' గురించి సినిమాలో ఉంటుందట సస్పెన్స్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రశాంతి పచ్చి పచ్చిగా రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది.  తెలుగు లో ఇప్పటివరకు రానటువంటి లెస్బియన్ చిత్రంగా ఈ కథ అని చెప్పవచ్చు..ప్రశాంతి, గీతాంజలి లీడ్ రోల్స్ లో నటించి ఇద్దరికీ ఇద్దరే అనే రీతిలో రెచ్చిపోయే వారి అందచందాలను వెండి తెర ఫై చూపించారని ట్రైలర్స్ చూస్తే తెలిసిపోతుంది.


ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుండి చాల మంది చిన్న నిర్మాతలు ‘సి’ గ్రేడ్ సినిమాలు , లెస్బియన్ సంబదించిన కథలను పట్టుకొని తమ చిత్రాల్లో నటించమని వస్తన్నారని బాధపడుతుంది..విలువల్లేని మూవీల్లో నటించిన ఈ బ్యూటి వద్దకు, ఇంతకంటే దారుణమైన కథల్లో నటించాలంటూ కొంతమంది నిర్మాతలు ప్రశాంతిని వేధిస్తున్నారంట. దీంతో ప్రశాంతి “ఎఫైర్ మూవీలో నటించి పెద్ద తప్పు చేశానంటూ”సన్నిహితులతో చెప్పుకొస్తుంది.  ప్రస్తుతం ప్రశాంతి చేతిలో రెండు చిన్న మూవీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర మూవీల్లో చిన్న చిన్న రోల్స్ లో నటిస్తుంది. ఎఫైర్ మూవీ కారణంగా తనకు వచ్చిన బోల్డ్ స్టార్ డం నుండి బయట పడాలని ప్రశాంతి తెగ ప్రయత్నిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: