కోనా వెంకట్ ప్రస్తుతమున్న తెలుగు కథా రచయితల్లో స్టార్ రైటర్. కోనా వెంకట్ గోపీ మోహన్ ఇద్దరు ఆవి భక్త కవుల్లా కలిసి సినిమాలకు పనిచేస్తుంటారు. అయితే వీరిద్దరు శ్రీనువైట్లకు కూడా చాలా క్లోజ్ మరి ఏమైందో ఏమో ఆగడు టైంలో కోనాకి, శ్రీను వైట్లకు బాగా చేడింది. ఇద్దరు బాహాటంగానే ఒకరినొకరు తిట్టుకున్నారు కూడా. పరిశ్రమంతా హాట్ టాపిక్ అయిన వారిద్దరి గొడవను పూనుకుని ఇద్దరిని కూర్చో బెట్టి సాల్వ్ చేశాడు చరణ్. అయితే నిన్న జరిగిన బ్రూస్ లీ ఆడియోలో కోనా వెకటే మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.


పరిశ్రమలో తామిద్దరు గొడవలు పడుతుంటే తలామాట అనుకున్నారని కాని ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం ఎవరు చేయలేదని అని ఘాటుగా స్పందించాడు. అంతేకాదు శ్రీనువైట్లకు తనకు క్లాశెష్ వచ్చాయన్న విషయాన్ని ఒప్పుకుంటూ చరణ్ పూనుకుని మా ఇద్దరిని కలిపాడని అన్నాడు. వేరే ఎవరు కూడా పట్టించుకోలేదు కాని చరణ్ మాత్రం మా ఇద్దరిని కలిపాడు. ఈ క్రెడిట్ అంతా చరణ్ కే దక్కుతుందని అన్నాడు.


బ్రూస్ లీ సినిమాలో చరణ్, రకుల్ :


ఇక శ్రీనువైట్ల మంచి దర్శకుడని మా కథలకు దర్శకత్వం వహించే సత్తా శ్రీనువైట్లకే ఉందని అన్నాడు. అయితే కోనా వెంకట్ అన్న మాటలు స్టేజ్ మీద ఎమోషన్ తో అన్నా సరే అది విన్న వారు మాత్రం టాలీవుడ్లో ఇలాంటి సంఘటనల సమహారానికి నాధి పలికింది. కోనా అన్న మాటలేంటంటే తాను శ్రీనువైట్ల గొడవపడితే మిగతా వాళ్లంతా చిలువలు పలువలుగా మాట్లాడారని అన్నాడు. మరోక్కసారి పరిశ్రమలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేశాడు కోనా వెంకట్.


మెగాస్టార్ ముఖ్య అతిధిగా వచ్చిన బ్రూస్ లీ ఆడియోలో తండ్రి కొడుకులిద్దరు వారి మెగా అభిమానులతో ముచ్చటించి అలరించారు. ఇక సినిమాలో మెగాస్టార్ సీన్ గురించి కూడా వివరించి ఆడిటోరియం మారిమోగిపోయేలా చేశాడు చరణ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: