సినీ తారల ఇళ్ళపై బుధవారం ఉదయమే ఐటి శాఖ దాడులు నిర్వహించారు.. ప్రముఖ హీరోయిన్లు సమంత, నయనతార, హన్సికతో పాటు తమిళ హీరో విజయ్, పులి నిర్మాత, దర్శకులు, ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు నిర్వహించి..సోదాలు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, కొచ్చి ప్రాంతాల్లోని కార్యాలయాలు, నివాసాలపై ఏక కాలంలో ఐటి శాఖ అధికారులు దాడులు సాగిస్తున్నారు. మొత్తం 32 చోట్ల ఈ దాడులు చేశారు. పన్ను ఆదాయానికి పన్ను చెల్లింపు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినందునే ఐటి శాఖ దాడులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. 


తమిళ సినీ హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతారల ఇళ్లపై జరిగిన సోదాల్లో దిమ్మతిరిగే ఆస్తులు వెల్లడైనట్లు సమాచారం. పులి సినిమాలో పెట్టుబడులు పెట్టిన వారు, తెరవెనుక బినామీ పెట్టుబడులకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  ఐటి అధికారుల దాడుల్లో వంద కోట్ల రూపాయల విలువైన నగలు, నగదు ఐటి అధికారులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఐటి అధికారులు రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

బుధ, గురువారాల్లో హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, మదురై, తదితర ప్రాంతాల్లో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వంద కోట్లు విలువ చేసే నగలు, నగదు, ఆస్తులు లెక్కలోకి రానివి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మద్య అగ్ర తారలు తమ పారితోషికాలను తక్కువ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక సమంత విషయానికి వస్తే ఈ అమ్మడు హైదరాబాద్ లో  ఖరీదైన ప్రాపర్టీలు, కారు కొన్నట్లు వార్తలు వచ్చాయి  ఈ నేపథ్యంలోదాడులు జరిగాయని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: