ప్రస్తుతం ఫిలింనగర్ అంతా చరణ్ కోసం బన్నీ చేసిన త్యాగం గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లుఅర్జున్ అల్లువారి అబ్బాయిగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక విలక్షణమైన క్రేజ్ ను ఏర్పరుచుకున్న మెగా అభిమానులు మాత్రం బన్నీని మెగా కుటుంబ హీరోగానే చూస్తారు. దీనితో అల్లుఅర్జున్ కూడ మెగా హీరోలందరితో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ అవసరమైనప్పుడు మెగా యంగ్ హీరోల సినిమాలను తన స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈనెల విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా విషయంలో అల్లుఅర్జున్ అందించిన సహాయానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ‘బ్రూస్ లీ’ సినిమాకు ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ ఉంది. అయితే ఈ ‘ఫైటర్’ అన్న టైటిల్ చరణ్ సినిమా కోసం చాలాకాలం క్రిందటే రిజిస్టర్ కూడ చేయించారట. 

ఒకానొక సమయంలో బోయపాటి శ్రీను అల్లుఅర్జున్ ల కాంబినేషన్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు ఈ ‘ఫైటర్’ టైటిల్ ను పెడితే బాగుంటుంది అని ఆలోచనలు కూడ వచ్చాయని టాక్. అయితే ఈ విషయమై నిర్ణయం తీసుకునే లోపే చరణ్ సినిమాకు ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ ను కూడ పెట్టడంతో రామ్ చరణ్ తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు  ‘సరైనోడు’ అన్న టైటిల్ తో సరిపెట్టుకున్నట్లు టాక్.

ఒకవైపు చిరంజీవి ప్రత్యేకపాత్ర సహాయం మరొక వైపు అల్లుఅర్జున్ త్యాగంతో కలిపి దూసుకు వస్తున్న ‘బ్రూస్ లీ’ అనుకున్న రికార్డులను బ్రేక్ చేస్తే బన్నీ చేసిన త్యాగానికి ఒక అర్ధం ఏర్పడుతుంది. ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒకే ఒక్క వారం గ్యాప్ తో వార్ కు సిద్ధం అవుతున్న ‘బ్రూస్ లీ’ – ‘అఖిల్’ సినిమాల మధ్య పోటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: