టాలీవుడ్ సినిమా కలెక్షన్స్ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఇండియన్ సినిమా రంగంలో టాప్ 10 మూవీస్ లో స్థానం సంపాదించుకుని ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన ‘బాహుబలి’ ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులకు సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసిన ఈసినిమా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులకు సమస్యగా మారడం షాకింగ్ న్యూస్.

ఆసక్తికరమైన ఈన్యుస్ వివరాలలోకి వెళితే ఈ సంఘటన తమిళనాడులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ కాలేజీలోని బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఈమధ్య నిర్వహించిన ఒక పరీక్షలో కొన్ని ప్రశ్నలు ‘బాహుబలి’ సినిమా పై రావడం అక్కడి విద్యార్ధులను ఆశ్చర్యపరిచింది అని టాక్. 

ఒక ఫైట్ సీన్ లో ప్రభాస్, రానాలకు దెబ్బలు తగలకుండా తీసుకున్న జాగ్రత్తలేమిటి ?, బాహుబలి సెట్ కు నువ్వే ఆ సెట్ కు ఇన్ చార్జ్ గా ఉంటే తీసుకునే జాగ్రత్తలేమిటి ? అనే ప్రశ్నలతో పాటు భవన నిర్మాణాలకు వాడాల్సిన ప్రమాణాలు ‘బాహుబలి’ సినిమా సెట్స్ లో ఏమి కనిపించాయి ? అనే ప్రశ్నలు విద్యార్ధుల పరీక్ష పత్రాలలో కనిపించడంతో విద్యార్దులు షాక్ అయినట్లు తెలుస్తోంది.

ఒకవైపు అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శింపబడుతున్న ‘బాహుబలి’ సినిమాకు ప్రశంసలు పెరిగిపోతూ ఉంటే మరో వైపు పరీక్షలలో కూడ ‘బాహుబలి’ మ్యానియా సంచలనాలు సృస్టించడం చూస్తూ ఉంటే ‘బాహుబలి’ రాజమౌళి క్రేజ్ ను రానున్న రోజులలో ఇంకా ఏ స్థాయికి తీసుకువెళుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: