కాకినాడలో జరిగిన  సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా విజయ యాత్ర లో అపశృతి చోటుచేసుకుంది. హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రయాణిస్తున్న కార్ ఓ అభిమాని కాలిపై నుండి దూసుకుపోయింది. దీంతో ఆ అభిమానికి కాలు విరిగింది. అక్కడే ఉన్న ఇతర  అభిమానులు 108 కి ఫోన్ చేసి అతనిని హాస్పిటల్ కు తరలించారు.టీవలే హరీష్ శంకర్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా  సక్సెస్ ను సాధించింది.

సినిమా విజయోత్సవ యాత్రను చేపట్టింది చిత్ర యూనిట్ దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఆడుతున్న థియేటర్ కు వెళ్ళారు చిత్ర యూనిట్ సభ్యులు. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడడంతో అక్కడి నుండి వెళ్ళే క్రమంలో హీరో ప్రయాణిస్తున్న కార్ ఓ అభిమాని కాలి మీది నుండి పోయింది.ఈ ఘటనపై చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్‌మీడియాలో స్పందించాడు.కాకినాడలో తమ అభిమాని గాయపడడం బాధను కల్గించిందని.


గాయపడిన అభిమానిని 108 కి తరలిస్తున్న అభిమానులు


అతన్ని ఆస్పటల్‌కి చేర్పించామని, కావలసిని చికిత్స చేయిస్తున్నామని తెలిపాడు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్ బరిస్తుందని పేర్కొన్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్ర చేపట్టింది. కాగా కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది.  భాదితునికి సుబ్రమణ్యం ఫర్ సేల్ అండగా ఉంటుందిని అతని హిస్పిటల్ ఖర్చులు అన్ని భరిస్తుందని ఆర్థిక సహాయం కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్ తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: