అక్టోబర్ 16న ‘బ్రూస్ లీ’ సినిమాను విడుదల చేయడానికి రామ్ చరణ్ రోజుకు 17 గంటలు కష్టపడటమే కాకుండా ఈమధ్యనే ఏకధాటిగా 24 గంటలు రకుల్ ప్రీత్ తో కలిసి ఒక పాటకు అలిసిపోకుండా రొమాన్స్ చేసి ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు రామ్ చరణ్. ఈ సినిమా మరి కొద్ది రోజులలో సెన్సార్ కూడ కాబోతోంది. 

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడ డబ్ చేసి భారీ స్థాయిలో తమిళనాడులో విడుదల చేయబోతున్నారు. దీనితో ఈ సినిమా పబ్లిసిటీ కోలీవుడ్ మీడియాలో కూడ ప్రారంభం అయింది. అయితే అనుకోకుండా ‘బ్రూస్ లీ’ కి కోలీవుడ్ సినిమా రంగం నుండి సమస్యలు మొదలయ్యాయి. 

ఈమధ్యనే హీరోగా మారిన కోలీవుడ్ సంగీత జీవీ ప్రకాష్ కుమార్ కోలీవుడ్ లో ‘బ్రూస్ లీ’ టైటిల్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. అయితే ఈవిషయం తెలుసుకున్న చరణ్ టీమ్  ‘బ్రూస్ లీ2’ పేరుతో ఈసినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసారు. అయితే ‘బ్రూస్ లీ’ విడుదల కాకుండా ‘బ్రూస్ లీ2’ ఎలా వస్తుంది అంటూ తమిళ ‘బ్రూస్ లీ’ నిర్మాత సెల్వకుమార్ ప్రస్తుతం చరణ్ ‘బ్రూస్ లీ’ టీమ్ కు చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. అంతేకాదు ఆ పేరుతో చరణ్ సినిమాను కోలీవుడ్ లో విడుదల చేయకుండా అడ్డుకోవడానికి తమిళనాడు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఈ సమస్య అక్కడ పరిష్కారం కాకపోతే చెన్నైలోని న్యాయస్థానం మెట్లు ఎక్కడానికి సెల్వకుమార్ ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ‘బ్రూస్ లీ’ తమిళ వెర్షన్ ఆడియో వేడుకలను ఈ వారంలో చెన్నైలో ఘనంగా చేయాలని చరణ్ టీమ్ ఆలోచిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఏర్పడిన ఈవివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమై పోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: