తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చారిత్రాత్మక చిత్రాలు వచ్చినప్పటికీ కాకీయుల చరిత్రపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రం ‘రుద్రమదేవి’. రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు ఈమె చరిత్రను నిశితంగా పరిశోదించి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అనుష్క ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దర్శక, నిర్మాత గుణశేఖర్.

దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 9న విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పదే పదే పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు 5 భారతీయ భాషల్లో విడుదల చేస్తామన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ సినిమాలో హైలెట్ కాబోతున్నాడు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 9వ తేదీ తెల్లవారు ఝామున 1 గంట నుండి 3 గంటల మధ్యలో షో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రుద్రమదేవి చిత్రం చూడాలనుకునే వారు బెనిఫిట్ షో టికెట్స్ కావాలంటే.. 8374095398, 8142011679 నంబర్లను సంప్రదించవచ్చు.

ఈ సందర్భంగా గుణ శేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఓ ఎపిక్‌ డ్రామా. 13 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కథను ఏమాత్రం వక్రీకరించకుండా తెరకెక్కించామన్నారు. రుద్రమదేవి చరిత్ర గురించి ఎన్నోపుస్తకాలు చదివాను. అంతేకాకుండా రీసెర్చ్‌ టీంను కూడ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ముదిగొండప్రసాద్‌ ఎంతగానో సహకరించారు. రుద్రమదేవి కాకతీయుల ప్రజలకోసం చేసిన త్యాగాలను , 40 ఏళ్లపాటు ఆరోజుల్లో ఓస్త్రీ అయిన ఆమె పరిపాలించిన విధానాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు.

రుద్రమదేవి చిత్ర నటులతో దర్శకుడు గుణశేఖర్

Rudramadevi

ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25రోజులపాటు లండన్‌లో ఈ రీరికార్డింగ్‌ కార్యక్రమాలు జరిగాయన్నారు.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు గొప్ప చిత్రాన్ని తీసావని దర్శకుడిని అభినందించడంతో పాటు యు /ఏ సెన్సార్ సర్టిఫికేట్ అందించారు. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: