బుల్లితెర కామెడీ షో జబర్దస్త్.. ఆ ఛానెల్ టి.ఆర్.పి రేటింగ్ ని అమాంతం పెంచేసింది. అయితే మొదట అనసూయ రెచ్చిపోయి తన హాట్ హాట్ అందాలతో జబర్దస్త్ ని మరింత జబర్దస్తీగా చేస్తే.. ఆమె స్థానంలో వచ్చిన రష్మి కూడా ఏ మాత్రం తగ్గకుండా యాంకరింగ్ చేసేస్తుంది. ఇక షోలో ఆమె మీద కూడా పంచ్ ల మీద పంచులు వేస్తారు ఉన్న కామెడీ టీమ్ అంతా. అయితే జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో అమ్మడు ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు గుప్పుమన్నాయ్. షోలో కూడా అప్పుడప్పుడు అలా చెప్పకనే చెబుతుంటాడు సుధీర్. అలా కుదరకపోతే తన టీం మేట్స్ తో చెప్పిస్తాడు. 


ఇకపోతే సుధీర్ బోర్ కొట్టడో ఏమోగాని రష్మి గౌతమ్, ఇప్పుడు సిద్ధు అనే హీరోని పట్టిందట. ఆయన ఎవరో కాదు గుంటూరు టాకీస్ అనే సినిమాలో రష్మితో జోడి కట్టిన హీరో. అమ్మడు ఈ హీరోతో కలిసి చెట్టాపట్టలేసుకుని తిరుగుతుందట. ఇది చూసిన వాళ్ళంతా జబర్దస్త్ పాపా భలే జోరుమీదుందే అని అనుకుంటున్నారు. అంతేకాదు గుంటూర్ టాకీస్ సినిమాలో కూడా రష్మి రెచ్చిపోయిందట. కాని అమ్మడు ఇలా ఆరునెళ్ళకు బోయ్ ఫ్రెండ్ ని మారిస్తే తర్వాత చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మరి.


మొదట్లో జబర్దస్త్ షోలో అనసూయ బదులు వచ్చిన రష్మి అంతగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్స్ ఇబ్బంది పడ్డా.. అమ్మడు ఇప్పుడు యాంకరింగ్ లో రాటుదేలింది. ఒకవిధంగా చెప్పాలంటే అనసూయని తలదన్నేలా యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది. అంతేకాదు అమ్మడు షోలో వేసుకునే కాస్టూమ్స్ కూడా కొంచం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా ఉంటున్నాయి. 


మరి రష్మి కావాలనే కాస్టూమ్స్ అలా వేసుకుంటుందో లేదా ప్రోగ్రామ్ కాస్టూమ్ డిజైనర్ అలాంటివి ఇసున్నారో తెలియదు కాని. జబర్దస్త్ లో స్కిట్ వేసేవాళ్ళ కన్నా రష్మిని చూసే వాళ్ళే ఎక్కువైపోయారట. అమ్మడు జోరు చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు మరి ఫాంలో ఉంది కాబట్టి ఓకే ఈ హవాలోనే ఇక వరుసెంట సినిమాలు చేస్తే కాస్త కూస్తో క్రేజ్ కూడా దక్కించుకునే అవకాశం ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: