రామ్ చరణ్ అభిమానులను రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఒక సెంటిమెంట్ తీవ్రంగా వేదిస్తోoది అంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ ప్రీత్  డేట్స్ కోసం టాప్ హీరోలు అంతా క్యూ కడుతూ ఉంటే చరణ్ అభిమానులు ఇలా రకుల్ ప్రీత్ ను చూసి భయపడి పోవడానికి ఒక విచిత్రమైన కారణం ఉంది. ‘బ్రూస్ లీ’ సినిమాలో చరణ్ పక్కన నటించి తన శక్తి మేరకు గ్లామర్ ఎక్స్ పోజ్ చేసిన రకుల్ ఒక రొమాంటిక్ పాటకు సంబంధించి తీసిన సీన్ లో చరణ్ కు లిప్ లాక్ ఇచ్చి నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్తలే చరణ్ అభిమానులకు భయాన్ని సృష్టిస్తున్నట్లు టాక్ . ఈ భయానికి ఒక విచిత్రమైన కారణం ఉంది. గతంలో రకుల్ ప్రీత్ లిప్ లాక్ చేసిన సినిమాలు అన్ని  ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి అన్న విషయాన్ని చరణ్ అభిమానులు తెరపైకి తీసుకు వస్తున్నారు. తన మొట్టమొదటి బాలీవుడ్ సినిమా ‘యారియన్’ లో రకుల్ కష్టపడి ఒక నిమిషం పాటు లిప్ లాక్ చేసినా ఆ సినిమా ఘోర పరాజయం చెందింది అని చరణ్ అభిమానుల వాదన. 

ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రకుల్ ప్రీత్ ఆది తో నటించిన ‘రఫ్’ సినిమాలో అదేవిధంగా రవితేజ తో నటించిన ‘కిక్ 2’ విషయంలో రకుల్ లిప్ లాక్ చేసిననా అవి ఘోరమైన ఫ్లాప్స్ గా మిగిలిన విషయాన్ని చరణ్ అభిమానులు గుర్తుకు చేస్తున్నారు. దీనితో ఈ లిప్ లాక్ సీన్ ను ఎడిటింగ్ లో తీసివేయమని చరణ్ అభిమానులు కోరుతున్నట్లు టాక్.  ఈ వార్తలు ఇలా ఉండగా గత రెండు రోజులుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా రామ్ చరణ్, రకుల్ ప్రీత్ లపై ‘లీ లీ బ్రూస్ లీ' సాంగ్  షూటింగ్ నిన్నటి తో పూర్తి అయ్యింది. ఈ సాంగ్ షూట్ జరుగుతున్న టైమ్ లో ఈసినిమా యూనిట్ కు  ఒక  సర్ప్రైజ్ కలిగింది.  

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘బ్రూస్ లీ’ షూటింగ్ స్పాట్ కు రావడమే కాకుండా చరణ్ తో కాసేపు పిచ్చాపాటి  మాట్లాడి చెర్రీ స్టెప్స్ ని బాగా ఎంజాయ్ చేసాడట. అంతే కాదు రాత్రి 2 గంటల వరకు చరణ్ తో పాటు సెట్లో ఎంజాయ్ చేసాడట. ఒక వైపు ‘బ్రూస్ లీ’ కి విడుదల కాకుండానే 20 కోట్ల లాభం వచ్చింది అని వార్తలు వస్తూ ఉంటే లేటెస్ట్ గా బయట పడుతున్న చరణ్ అభిమానుల  రకుల్ ప్రీత్ సెంటిమెంట్ రామ్ చరణ్  కు షాకింగ్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: