వెబ్ మీడియా సంస్కృతి ఎలాంటి గొప్ప వ్యక్తిని అయినా ఎలా షేక్ చేస్తుందో అనేక ఉదహారణలు ఉన్నాయి. ఈరోజు ఉదయం పూర్తిగా తెల్లవారకుండానే కొంతమంది ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చనిపోయాడు నివాళి అంటూ చేసిన ట్వీట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. 

తన ట్విట్స్ తో దేవుళ్ళ దగ్గర నుంచి అందర్నీ టార్గెట్ చేసే వర్మను టార్గెట్ చేస్తూ వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ట్విట్స్ చూసి వర్మకు కూడ మైండ్ బ్లాంక్ అయింది అనుకోవాలి. అందుకే ఆ ట్విట్ ను ఏమి కోపగించుకోకుండా ఆహ్వానించడమే కాకుండా ఆ ట్విట్ ఫోటోను తన ట్విటర్ లో పెట్టి అందరికీ షేర్ చేస్తున్నాడు వర్మ.

అంతేకాదు ఈ ట్విట్ ను మీ సన్నిహితులందరికీ షేర్ చేయండి అంటూ వర్మ తన మనసులోని మాటను అందరికీ వ్యక్త పరిచాడు. కొద్ది రోజుల క్రితం పవన్ అభిమానులను ఉద్దేసించి వర్మ చేసిన ఘాటైన వ్యాఖ్యలు పెను సంచలనం సృస్టించిన నేపధ్యంలో ఎవరో ఒకరు వర్మ పై పగ పట్టి ఇలా అర్దరాత్రి హంగామా చేసి ఉంటారని టాక్.

ఇప్పటికే సినిమాలలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న వర్మ తన మరణ వార్త పై వచ్చిన ట్విట్ ను తానే షేర్ చేసి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఏది ఎలా ఉన్నా ఈరోజు వెబ్ మీడియాకు వర్మ మరణ వార్త ట్విట్ హాట్ న్యూస్. దటీజ్ వర్మ క్రేజ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: