ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి చూపు సూపర్ స్టార్ రజనీకాంత్ వైపే ఉంది. ఎందుకంటే గత కొంత కాలంగా రజనీకాంత్ నుండి అభిమానులు ఆశించే స్థాయిలో సినిమాలు రావటం లేదు. అలాగే రజనీకాంత్ తో డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ సైతం, రజనీకి మంచి మూవీలను ఇవ్వటం లేదు. దీంతో రజనీకాంత్ తను ఎంచుకుంటున్న కథల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు.


ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న ‘కబలి’ మూవీ సౌత్ లో హాట్ టాక్స్ గా మారింది. తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమానే‘కబలి’. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ‘కబలి’ మూవీలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.


ఇక బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను విదేవీ లొకేషన్స్ లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లానింగ్స్ ని రెడీ చేసుకుంటుంది. భాషా సినిమా తరువాత ఆ తరహాగ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రజనీకాంత్ ఇప్పటి వరకూ నటించలేదు.  ఇక తను నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’ భాషాని మించి ఉంటుందని అంటున్నారు.


ఇప్పటికే కబాలి ఫస్ట్‌ లుక్ పోస్టర్, ఈ మూవీపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం కబాలి మూవీ చెన్నై లొకేషన్స్ లో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత మలేషియాలో ఓ భారీ షెడ్యూల్ జరగనుంది. అక్టోబర్ లో 3వ వారంలో మొదలుకానున్న ఈ షెడ్యూల్, నవంబర్ చివరి వారం వరకూ జరుగుతుంది. ఈ మూవీలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: