సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న అందాల భామ ఆసిన్ కేరళలో ఒక కాథలిక్ కుటుంబంలో జన్మించింది. సౌత్‌ ఇండియాతో పాటు హిందీ ఫిల్స్‌ ఇండస్ట్రీలో కూడా పేరు సంపాదించున్న ఆసిన్ ఇంట త్వరలో పెళ్లి భాజా మోగనుంది. .దీనికి సంబందించిన ఏర్పాట్లు  చకచకా జరిగిపోతున్నాయి.. సౌత్ లో మంచి నటిగా పేరు తెచుకున్న ఈ భామ గజనీ చిత్ర రీమేక్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ లోను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న అసిన్ ఆ మధ్య మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మ తో ప్రేమలో పడ్డారు.అతనితో చాలా సంవత్సరాలు పాటు డేటింగ్ చేసింది అసిన్. చివరికి ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నారు.తెలుగులో ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘లక్ష్మీనరసింహ’, ‘ఘర్షణ’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన అసిన్… బ్లాక్‌బస్టర్ హిట్ ‘గజినీ’ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.  

ఆసిన్ ఫోటో షూట్


హిందీలో పలు హిట్ సినిమాలు చేసినా ఈ మధ్యన ఆమె హీరోయిన్‌గా పెద్దగా రాణించలేకపోయింది.  ప్రస్తుతం 'ఆల్ ఈజ్ వెల్‌' అనే మూవీలో నటిస్తోంది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో పదో స్థానంలో ఉంది  మైక్రోమ్యాక్స్‌. నటుడు అక్షయ్‌కుమార్‌ ద్వారా మొదట సారిగా ఈ జంట కలుసుకున్నారు. జీవితంలో పెళ్లి చేసుకొని స్థిరపడాలని నిర్ణయించుకొని ఇటీవల ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం తన వివాహ వేడుక కోసం లండన్, ప్యారిస్, న్యూయార్క్‌లో షాపింగ్ చేస్తోంది అసిన్. పెళ్లి డేట్‌ ఎప్పడనేది ఈ జంట ఇంకా ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: