ఈనెల 16న విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ పవన్ కు ఒక విషయంలో కోపం తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమా ఆడియో ఫంక్షన్ రోజున మెగా అభిమానులకు పాస్ లు ఇచ్చే వ్యవహారంలో చిరంజీవి అభిమాన సంఘానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పాస్ ల పంపిణి విషయంలో పవన్ అభిమానులు ఎన్నిసార్లు అడిగినా వారిని పక్కన పెట్టి, మిగతా మెగా అభిమానులందరికీ పాస్ లు పంపిణి చేసిన విషయం పవన్ అభిమానుల ద్వారా పవన్ దృష్టికి వెళ్ళినట్లు టాక్.

ఈ విషయాన్ని తన అభిమానుల ద్వారా తెలుసుకున్న పవన్ జరిగిన సంఘటనపట్ల అసహనం వ్యక్తపరచడమే కాకుండా భవిష్యత్ లో జరిగే మెగా హీరోల సినిమా ఫంక్షన్స్ కు దూరంగా ఉండమని తన అభిమానులకు సూచించినట్లు టాక్. పవన్ అభిమానులకు ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో ఎటువంటి ఎంట్రీ లేకపోవడంతో పవన్ ప్రస్తావన లేకుండా ఆ ఆడియో ఫంక్షన్ జరిగింది అని కొందరి వాదన.

దీనిని బట్టి చూస్తూ ఉంటే త్వరలో జరగబోయే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ వేడుకకు సంబంధించిన పాస్ ల విషయంలో మిగతా మెగా అభిమానులకు ఇదే పద్ధతి రిపీట్ అవుతుంది అని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ పాస్ ల విషయం పవన్ దృష్టి వరకు రావడం కూడ పవన్ ఆఖరి నిముషంలో ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకకు రాకుండా తప్పించుకోవడం ఒక కారణం అనే వార్తలు కూడ ఉన్నాయి.

అయితే పాస్ ల పంపిణి విషయంలో జరిగిన పొరపాటు చిన్నదే అయినా ఇప్పటికే వేరువేరు వర్గాలుగా విడిపోయిన పవన్ చిరంజీవి అభిమానుల మధ్య ఈ చిన్న సంఘటన మరింత దూరాన్ని పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: