కన్నడ  కంఠీవ సూపర్‌ స్టార్ దివంగత రాజ్‌కుమార్ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన శివరాజ్ కుమార్ మంచి పాపులర్ హీరో అందరికీ సుపరిచితమే.. ఈ మధ్యనే శివరాజ్‌కుమార్ తన కుమార్తె పెళ్లి వేడుకను చాలా ఘనంగా చేశారు. శివరాజ్ కుమార్ హఠాత్తుగా  గుండెపోటుకు గురయ్యారు వెంటనే ఆయన్ని బెంగుళూరులోని విఠల్ మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ నిర్వహించారు. దాంతో ధమనుల్లో రెండు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది.

 మంగళవారం సాయంత్రం జిమ్‌లో ఉండగా ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారట. వెంటనే జిమ్ ఇంఛార్జి శివరాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు తెలపడంతో ప్రాథమిక చికిత్స అనంతరం..బెంగుళూరులోని విఠల్ మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వార్త  శాండిల్‌వుడ్‌లోను, దక్షిణాది చలన చిత్ర సీమను షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా రెండు రోజుల పాటు ఆయన్ను పూర్తిగా వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని నిర్ణయించారు.

కిల్లర్ వీరప్పన్ చిత్రంలో శివరాజ్ కుమార్


ప్రస్తుతం శివరాజ్ కుమార్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో నటిస్తున్నారు.. ఇంకోవైపు, శివరాజ్‌కుమార్‌ ఉన్న మాల్యా హాస్పటల్స్‌కు ఫ్యాన్స్ పోటెత్తారు.  ఆయన త్వరగా కోరుకోవాలని సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వారి కుటుంబానికి సందేశాలు పంపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: