చిన్న సినిమాలు చేస్తూ ఒక్కసారిగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రస్తుతం తన హవా కొనసాగిస్తుంది. అయితే రవితేజ కిక్-2 విషయంలో అమ్మడికి మంచి షాక్ తగిలింది. ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలు కురిపించి మాస్ మహరాజ్ కు ఏకంగా లిప్ లాక్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. అయితే కిక్-2 ఫ్లాప్ వలన అమ్మడికి కొంచం భంగపాటు కలిగినా వరుసెంట చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు ఉండే సరికి గాలిపీల్చుకుంది. అయితే ప్రస్తుతం అక్టోబర్ 16న బ్రూస్ లీ రిలీజ్ అవుతుంది.


ఆ సినిమాలో అమ్మడు అందాలను అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయిందని కనిపిస్తూనే ఉన్నా ఇంత చేసినా ఈ సినిమా అమ్మడుకి హిట్ ఇస్తుందా అనే డౌట్ కలుగుతుంది. అసలే సెంటిమెంట్ బాలేదని అమ్మడి లిప్ లాక్ సీన్ కూడా సినిమాలో లేకుండా జాగ్రత్త పడ్డాడు చరణ్. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అమ్మడికి చెర్రి సినిమా హిట్ ఇస్తుందా లేదా అన్నది కొద్దిరోజుల్లో తేలనుంది.


బ్రూస్ లీ సినిమాలో చరణ్, రకుల్ : 


స్టార్ హీరోల సినిమాలో అవకాశాలైతే త్వరగానే సంపాధించిన ఈ హాట్ గాళ్ వాటిని హిట్ బాట పట్టించే ప్రయత్నంలో ఆపసోపాలు పడుతుంది. ఒకవేళ బ్రూస్ లీ కనుక నెగటివ్ టాక్ తెచ్చుకుంటే ఇక పెద్ద హీరోల సినిమాలకు రకుల్ తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు కాస్త వెనుకడుగేస్తారు. మరి అందివచ్చిన అవకాశాన్ని అమ్మడు లక్ ఎలా మార్చనుందో చూడాలి.


అల్లు అర్జున్ సినిమాలో రకుల్ ఎవరూ ఊహించని విధంగా పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించనున్నదట. మరి స్టార్ హీరోల సినిమాల కోసం ఇన్ని కష్టాలు పడుతున్న రకుల్ కి సరైన హిట్ వచ్చి స్టార్ హీరోయిన్ గా కూడా సక్సెస్ బాట పట్టాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: