ఎన్నోకష్టాలు దాటుకుని రేపు రిలీజ్ కాబోతున్న ‘రుద్రమదేవి’ సినిమాకు ఆన్ లైన్ టికెట్స్ మంచి జోరుగా బుక్ అయి పోతున్నా గుణశేఖర్ ను మాత్రం ఈసినిమాకు సంబంధించి రానా సెంటిమెంట్ భయపెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. సినిమా వాళ్లు అంటేనే సెంటిమెంట్లు. కోట్లతో ముడిపడ్డ వ్యవహారం కాబట్టి  అటువంటి సెంటిమెంట్స్ కు దర్శక నిర్మాతలు హీరోలు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  

ఇప్పుడు రానా దగ్గుబాటి విషయంలో ఒక విచిత్ర మైన సెంటిమెంట్  గుణశేఖర్ ను వెంటాడుతోంది. రానాకు  తన బాబాయి  వెంకటేష్ తో చేసిన హీరోయిన్లతో రొమాన్స్ చేసిన  సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి అన్నసెంటిమెంట్ ఉందట. 

దీనికి ఉదాహరణగా గతం లో వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’ లో నటించిన జెనీలియాతో రానా  ‘నా ఇష్టం’ సినిమాలో నటిస్తే ఘోరంగా ఫ్లాప్ అయిoది.  అదే విధంగా వెంకటేష్ తో ‘లక్ష్మీ’, ‘తులసి’ లాంటి సినిమాల్లో నటించిన నయనతారతో  ‘కృష్ణం వందే జగద్గురుం’లో రానా నటిస్తే అది కూడ కలిసి రాలేదు.  ఇప్పుడు లేటెస్ట్ గా వెంకటేష్ తో  ‘చింతకాయల రవి’ సినిమాలో రొమాన్స్ చేసిన అనుష్కతో రానా ‘రుద్రమదేవి’లో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాగా ఫ్లాప్ అయింది.

దీనితో ఈ సెంటిమెంట్ ప్రభావం ‘రుద్రమదేవి’ విజయం పై ఉంటుందా అన్న టెన్షన్ గుణశేఖర్ కు మొదలు అయింది అని అంటున్నారు. అయితే రానా అనుష్కతో కలిసి   ‘బాహుబలి’లో నటించినా ఆ సినిమాలో రానాది నెగిటివ్ క్యారెక్టర్ కదా అన్న విషయం కుడా గుణశేఖర్ ను భయపెడుతోంది అని టాక్. ఏమైనా ఈ సెంటిమెంట్స్ సమాధానం దొరకాలి అంటే రేపటి వరకు ఆగాలి



మరింత సమాచారం తెలుసుకోండి: