ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి నాగార్జున కుటుంబాల వారసుల మెగా వార్ కు రాబోతున్న దసరా వేదిక కావడంతో ఈరెండు భారీ సినిమాలు విజయం సాధిస్తాయా లేదంటే ఈ రెండిటిలో ఎదో ఒకసినిమా విజయం సాధిస్తుందా అన్న ఆతృత సాధారణ ప్రేక్షకులలో కూడ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో అఖిల్ అనుకోకుండా మెగా సమస్యలలో ఇరుక్కున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.

‘అఖిల్’ దసరా పండుగ రోజైన అక్టోబర్ 22న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ‘బ్రూస్ లీ’ సినిమాకు వారంరోజుల గ్యాప్ ను ‘అఖిల్’ దర్శక నిర్మాతలు చూసుకున్నారు కాని, ఒక కీలక విషయాన్ని మరిచిపోయారు అని టాక్. చరణ్ ‘బ్రూస్ లీ’ అక్టోబర్ 16న విడుదల అవుతున్న నేపధ్యంలో మన ఇరు రాష్ట్రాలలోని అనేక ధియేటర్లతో 7 రోజుల ఎగ్రిమెంట్ ‘బ్రూస్ లీ’ నిర్మాతలు ఇప్పటికే తీసుకున్నారు అని టాక్. 

దీనితో ‘అఖిల్’ విడుదల కాబోతున్న 22వ తారీఖుకు ‘బ్రూస్ లీ’ ఎగ్రిమెంట్లు పూర్తికావు. ఈ నేపధ్యంలో 23వ తారీఖు నుండి మాత్రమే ‘అఖిల్’ సినిమాకు కోరుకున్న స్థాయిలో ఎక్కువ ధియేటర్లు దొరుకుతాయి. అందువల్ల విజయదశమి సెంటిమెంట్ తో 22న ‘అఖిల్’ సినిమాను తక్కువ ధియేటర్లలో విడుదల చేస్తే అది ఓపెనింగ్ డే కలక్షన్స్ రికార్డు పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. 

రేపు విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ సినిమా టాక్ ‘అఖిల్’ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ పై తీవ్రంగా ప్రభావితం చూపెడుతుంది అని చెపుతున్నారు. గుణశేఖర్ ఊహిస్తున్న విధంగా ‘రుద్రమదేవి’ సక్సస్ ను అందుకుంటే గుణశేఖర్ ఇప్పటికే తన సినిమాకు సంబంధించి దియేటర్స్ వారి నుండి రెండు వారాల ఎగ్రిమెంట్లు తీసుకున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘రుద్రమదేవి’, ‘బ్రూస్ లీ’ ల మధ్య ధియేటర్లు దొరకక రిలీజ్ డేట్ ను మరో డేట్ కు వాయిదా వేసుకోలేక తీవ్రమైన మెగా సమస్యల మధ్య ‘అఖిల్’ ఇరుక్కు పోయాడు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: