తెలుగు ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతగా గుణశేఖర్ బ్లాక్ బ్లస్ట్ మూవీస్ తీసిన పేరుంది..13వ శతాబ్దం నాటి కాకతీయ సామ్రాజ్యాని ఏలిన మహరాణి రుద్రమదేవి చరిత్రపై కొన్ని సంవత్సరాలుగా పరిశోదన చేసి కాకతీయ వైభవం ప్రేక్షకులకి మర్చిపోలేని అనుభూతిగా మిగలాలనే సాంకేతికంగా ఎన్నో అవరోధాలు దాటుకుని 3డిలో అనుష్క ప్రదాన పాత్రగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వాస్తవానికి ఈ సినిమా  మే నెల ఎండింగ్ లో విడుదల చేయాలనుకున్నా.. వాయిదాలు పడుతూ అన్ని ఇబ్బందులు దాటుకుంటూ రేపు విడుదల కాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా రిలయన్స్ సంస్ధ పంపిణి చేస్తుంది. తెలుగులో హేమా హేమీలైన ప్రముఖనిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి కొర్రపాటి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రానికి పంపిణిదారులుగా ఉండటంతో గుణశేఖర్ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు.

ఈ సినిమా  100 కోట్ల క్లబ్ లో ఖచ్చితంగా చేరుకుంటుందని భావిస్తున్నారు. తాజాతా ఈ సినిమా కు పోటీగా  ఓ మలయాళ డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది.. మళియాలంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం తెలుగులో  ''ది ఐస్ '' పేరుతో డబ్ చేస్తున్నారు నిర్మాత వెంకటేష్ . గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ''365 డేస్ '' వంటి చిత్రాన్ని నిర్మించిన వెంకటేష్ ఈ డబ్బింగ్ చిత్రాన్ని అందిస్తున్నారు .

రుద్రమదేవి పోస్టర్


ఈ చిత్రంలో గుడుంబా శంకర్ సినిమాలో పవన్ సరసన నటించిన హీరోయిన్ మీరా జాస్మిన్ ముఖ్య భూమిక పోషించింది. ఈ చిత్రం మళియాలంలో సూపర్ హిట్ టాక్ తెచ్చకోవడంతో తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు  వెంకటేష్. ఇక రుద్రమదేవి ఇప్పటికే ప్రమోషన్ వర్క్స్, యాడ్స్ విపరీతంగా పబ్లిసిటీ చేశారు దర్శక,నిర్మాత గుణశేఖర్. రుద్రమదేవికి పోటీగా  ''ది ఐస్ '' ఎంత వరకు నిలుస్తుందో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: