‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో తన ఉత్సాహానికి తన అభిమానుల ప్రేమానురాగాలే ఫ్యూయల్ అంటూ తన మెగా అభిమానులను పొగడ్తలతో ముంచేసిన చిరంజీవి అదే ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ నుండి బయటకు వస్తూ తనకు ఎదురైన అభిమాని వంక అసహనంతో చూస్తూ ‘స్టుపిడ్ ఫెలో' అంటూ కామెంట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వెబ్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 

మెగా అభిమానుల ప్రేమతో తెలుగు సినిమా రంగానికి ఒక చక్రవర్తి స్థాయికి ఎదిగిన చిరంజీవి తీవ్ర అసహనంతో ఆ అభిమాని పై ఎందుకు అంత ఘాటుగా కామెంట్ చేసాడో తెలియకపోయినా ప్రేక్షకులే తమ దైవాలు అని మాటలు చెప్పే చిరంజీవి నోటి వెంట ఇటువంటి మాటలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

అసలు ఈ వీడియోను వెబ్ మీడియాలో ఎవరు అప్ లోడ్ చేసారు అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా చిరంజీవి నోటి వెంట వచ్చిన మాటలు విని మెగా అభిమానులే షాక్ అవుతున్నట్లు టాక్. రాజకీయ నేతగా ఎదిగి తెలుగువారిని పరిపాలించాలి అన్న కోరికతో రాజకీయాలలోకి వచ్చి ఘోర పరాభం చెందినా చిరంజీవి పై ఉండే మోజుతో చిరూని ఆరాధిస్తున్న వారు లక్షల మంది ఉన్నారు. 

అయితే అటువంటి చిరంజీవి వీరాభిమానులకు కూడ ప్రస్తుతం వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ వీడియో షాక్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: