అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ హీరోగా ఇంకా సెట్ రైట్ మాత్రం అవ్వలేదు. అప్పట్లో వరుసెంట సినిమాలు చేసిన ఈ కుర్ర హీరో లాస్ట్ సినిమా అడ్డా కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయే సరికి కాస్త టైం తీసుకుని వస్తున్నాడు. ప్రస్తుతం మొన్నటిదాకా మంచు ఫ్యామిలీ సినిమాలు చేసిన జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు సుశాంత్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం హాట్ గాళ్ సోనం బజ్వాని సెలెక్ట్ చేశాడు. సినిమాలైతే తీస్తున్నాడు కాని సరైన హిట్ మాత్రం కొట్టని నాగ సుశీల తనయుడు ఈసారి గట్టి కసి మీద వస్తున్నాడు.


అందుకే సినిమాలో కాస్త ఎక్స్ పోజింగ్ పాళ్లు కూడా ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. అయితే సుశాంత్ హీరోగా అందాలు ఆరబోయడానికి ఎవరు ఒప్పుకుని ఉంటారో గెస్ చేయండి. బాలీవుడ్లో అదృష్టం పరిక్షించుకుని సరైన అవకాశం వస్తే రెచ్చిపోతా అని అంటున్న సోనం బజ్వా సుశాంత్ తో ఆడిపాడుతుంది.


సుశాంత్ సినిమా అంటే కమర్షియల్ అవ్వక పోయినా సినిమా క్వాలిటీ మాత్రం పెద్ద హీరోల సినిమాల మాదిరి ఉంటుంది. అయితే ఈసారి మంచి కథ కథనాలతో పాటుగా సినిమాలో రెచ్చిపోయే హీరోయిన్ కూడా ఉంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని సోనం బజ్వాని హీరోయిన్ గా ఓకే చేశాడు. చాలా మంది ఆడిషన్స్ చేసినా సోనం అయితేనే బాగుంటుందని భావించి ఆమెనే ఫైనల్ చేశారట చిత్ర యూనిట్. అదీగాక అమ్మడి హాట్ లుక్స్ ఇప్పటికే హాట్ ఫెవరేట్ అయ్యాయి. అందుకే అమ్మడితో సినిమా చేస్తే కమర్షియల్ గా సక్సెస్ అవుతుందని అంటున్నారు.


ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ఎనౌన్స్ మెంట్ తో పాటుగా మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా తెలియచేయనున్నారు. మరి సుశాంత్ ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: