శ్రీమంతుడు సినిమా సక్సెస్ జోష్ మీదున్న మహేష్ ను సినిమా సక్సెస్ అయినందుకు మిమ్మల్ని ఎవరెవరు మెచ్చుకున్నారని ఓ ఇంటర్వ్యూలో అడిగితే తనకి చరణ్ తప్ప మరెవరు విష్ చేయలేదని. ఇంత గొప్ప సినిమా తీసినా కనీసం ఎవరు ఫోన్ చేసి కూడా తమ స్పందన తెలుపలేదని వాపోయాడు ప్రిన్స్. అయితే మహేష్ మాటలు అలా నిజాలు మాట్లాడేసరికి అందరు ఖంగారుపడ్డారు. శ్రీమంతుడు టైంలో మహేష్ అన్న మాటలు కూడా సెన్షేషన్ అయ్యాయి. అయితే మహేష్ అన్న మాటలకు హర్ట్ అయిన బన్నీ వెంటనే సినిమా గురించి మహేష్ కి ఫోన్ చేసి విష్ చేశాడట.


లేట్ గా చెబుతున్నందుకు సారి కూడా చెప్పాడట బన్నీ. అయితే మహేష్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సినిమా గురించి మాట్లాడాడట. అయితే సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసి మహేష్ హీరోలెవరు సినిమా గురించి మాట్లాడలేదని కాస్త ఫీల్ అయ్యాడు అందుకే ఆరోజు ఇంటర్వ్యూలో అలా ఒకేసారి అలా ఫైర్ అయ్యాడు.  సినిమా చూసిన బన్నీ వెంటనే చేసి ఎందుకు చెప్పలేదంటే మహేష్ తో అంత సాన్నిహిత్యం లేనందువల్లే చేయలేదట.


ఇక మొన్నటిదాకా నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ గురించి ఫారిన్లో ఉండొచ్చిన ఎన్టీఆర్ కూడా శ్రీమంతుడు చూసి మహేష్ కి ఫోన్ చేసి ముచ్చటించడం తెలిసిందే. మొత్తానికి హీరోలంతా ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్న సందర్భం కనబడుతుంది. మరి ఇది ఇలానే కంటిన్యూ చేస్తే బెటర్. పోటీ అనేది సినిమాల ద్వారా ఉండాలి కాని బయట కాదు. ఇలా తాము అంతా కలిసి మెలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా వారి పద్ధతి మార్చుకునే ఛాన్స్ ఉంది.


మొత్తానికి మహేష్ చేసిన షాకింగ్ కామెంట్స్ కి అందరు హీరోలు దారికొచ్చారని అనిపిస్తుంది. మహేష్ లాంటి హీరో చెప్పాడు కాబట్టి అందరు పాజిటివ్ గా తీసుకున్నారు. ఇక నుండి ఏ హీరో హిట్ కొట్టినా అందరి విష్ చేసుకోవడం అనే సెంటిమెంట్ ఏర్పడేలా ఉంది పరిస్థితి చూడబోతుంటే. 


మరింత సమాచారం తెలుసుకోండి: