ఈరోజు రిలీజ్ అవుతున్న రుద్రమదేవి అఫిషియల్ గా షోస్ పడకముందే నైట్ ప్రీమియర్లు ఏర్పాటుచేశారు చిత్ర యూనిట్. అయితే ఆ షో చూసిన వాళ్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుష్క సినిమా మొత్తం అదరగొడితే గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇరగదీశాడట. మొదటనుండి గుణశేఖర్ గోనగన్నారెడ్డి పాత్రపై కొంచం ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే సినిమా చూసిన వాళ్లంతా అల్లు అర్జున్ అదరగొట్టాడని కితాబిస్తున్నారు. ఓ పక్క సినిమా చూసిన సిని ప్రముఖులు కూడా బన్నీ యాక్టింగ్ కి ఫిదా అయ్యారట.


స్టైలిష్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఏ క్యారక్టర్ చేసిన దాన్ని ఇరగదీస్తాడు. అయితే మొదటి సారి హిస్టారికల్ సినిమాలో బన్నీ ఎలా ఉంటాడా అని కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. అయితే ముందు వదిలిన టీజర్, ట్రైలర్స్ లో గోన గన్నారెడ్డిగా బన్నీ అదరగొట్టాడనే చెప్పాలి. అయితే అదే కొనసాగిస్తూ ఇక సినిమాలో అరంగంట పాత్ర అయినా బన్నీ యాక్టింగ్ చించేశాడట పీక్స్ కి వెళ్లిందట.


గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ :


గుణశేఖర్ మూడు సంవత్సరాల కల ఈరోజు నెరవేరబోతుంది. సినిమాకు అనూహ్యంగా క్రేజ్ వచ్చి అంతా పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది. అనుష్క కూడా సినిమాలో పవర్ఫుల్ గా చేసిందట. ఇక సినిమా కాస్ట్ మొత్తం తమ తమ పరిధి మేరకు యాక్టింగ్ అదరగొట్టారట. అయితే మెగా అభిమానులు మాత్రం గోనగన్నారెడ్డి పాత్ర కోసం సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గర క్యూలు కట్టరు.


ఇక సినిమాలో చివర 20 నిమిషాలు బన్నీ యాక్టింగ్ పీక్స్ కి వెళ్లిందట. సినిమాలో హైలెట్ అయిన బన్నీ యాక్టింగ్ కలెక్షన్ల కేక పెట్టించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడనే అందరు అనుకుంటున్నారు. సరైన సమీక్ష ఇంకొన్ని గంటల్లో మీముందు ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: