ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన రుద్రమదేవి మూవీ, అక్టోబర్9న థియోటర్స్ ని హిట్ చేసింది. అల్లుఅర్జున్, రానా, అనుష్క వంటి స్టార్స్ నటించిన ఈ మూవీని చూడటానికి మెగాఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. మూవీలో అల్లుఅర్జున్ గెటప్, యాక్షన్ అధిరేలా ఉన్నాయ్ అనే టాక్స్ బయటకు రావటంతో, ఈ మూవీకి మెగాఅభిమానుల తాకిడి ఎక్కువుగా ఉంది.


మరోవైపు రుద్రమదేవి మూవీని స్టోరీని వ్యక్తిగతంగా అభిమానించే ప్రేక్షకులు...ఈ మూవీని చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన చిత్రంగా రుద్రమదేవి మూవీ మారింది. ఇలా ఏదొక విధంగా ప్రేక్షకుడు మూవీని చూడటం కోసం థియోటర్స్ వద్దకు వస్తున్నారు. ఈ విధంగా రుద్రమదేవి రిలీజ్ అయిన అన్నీ సెంటర్స్ లో, దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీని చూపిస్తుంది.


దీంతో ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ భారీగానే ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దసర పండుగ సెలవుల్లోనూ ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే 100శాతం ఆక్యుపెన్సీ చూపించి ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 15 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చనే టాక్స్ వినిస్తున్నాయి.


ఈ లెక్కలు అన్నీ ప్రి బుకింగ్స్ ద్వారా జరిగిన టికెట్స్ స్టేటస్ ద్వార సేకరించబడిన రిపోర్ట్స్. ఇక ఈ ప్రి బుకింగ్ రిపోర్ట్స్ ప్రకారం, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, వంటి ఏరియాల్లో ఈ మూవీ 100 శాతం ఆక్యుపెన్సీని చూపించగా,  తెలంగాణలోని ప్రతి జిల్లా హెడ్ క్యార్టర్స్ లో రుద్రమదేవి మూవీకి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇక రూరల్ టౌన్స్ లో ఈ మూవీ 95 శాతం ఆక్కుపెన్సీని చూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: