‘రుద్రమదేవి’ లో రానా ఎలివేట్ కాలేదు అన్న కామెంట్స్ రానా కు షాక్ ఇచ్చాయని టాక్. ఈరోజు విడుదలైన ‘రుద్రమదేవి’ లో రానా పాత్ర ‘బాహుబలి’ భల్లాల దేవా స్థాయిలో లో ఉంటుందని చాలామంది ఆశించారు. అయితే అందరి అంచనాలు తలక్రిడులు చేస్తూ ఈరోజు విడుదలైన ‘రుద్రమదేవి’ లోని రానా పాత్ర పెద్దగా ఎవర్ని మెప్పించ లేకపోయిందని వార్తలు వస్తున్నాయి. గుణశేఖర్ రానా పోషించిన నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడు పాత్రకు సరైన ప్రాధాన్యత ‘రుద్రమదేవి’ లో ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన అల్లుఅర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర ఎలివేట్ చేయడం కోసం రానా పాత్రను చివరి నిముషంలో గుణశేఖర్ ఎడిటింగ్ లో తగ్గించాడు నే వార్తలు కూడ ఉన్నాయి. ‘బాహుబలి’లో భళ్లారదేవుడిగా రానా యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌ని ఆడియన్స్ గుర్తు చేసుకుంటూ ఆ రేంజ్ లో రానా పాత్ర ‘రుద్రమదేవి’ లో లేదు అని సాధారణ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నట్లు టాక్. 

అంతేకాదు మరికొందరు ప్రేక్షకులు అయితే ఇలాంటి ప్రాధాన్యత లేని రోల్ ను రానా ఎందుకు ఒప్పుకున్నాడు అన్న కామెంట్స్ కూడ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘రుద్రమదేవి’లో మంత్రిగా ప్రకాశ్ రాజ్, మహారాజుగా కృష్ణంరాజు, నెగిటివ్ షేడ్స్‌లో సుమన్ తమతమ పాత్రలలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటే ఆ పాత్రల ముందు రానా పాత్ర తేలిపోయింది అన్న కామెంట్ కూడ వినిపిస్తోంది. 

ఇది ఇలా ఉండగా ‘రుద్రమదేవి’ చరిత్ర పై సరైన అధ్యయనం చేయకుండా గుణశేఖర్ ఈసినిమాను తీసాడా అని అనిపిస్తోందని కొంతమంది చరిత్ర తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ పై గుణశేఖర్ చూపించిన శ్రద్ద సరైన స్క్రీన్ ప్లేను సమకూర్చుకోవటంలో మర్చిపోయాడు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద చూస్తే ‘రుద్రమదేవి’ లో అనుష్క హడావిడి కంటే గోన గన్నారెడ్డిగా అల్లుఅర్జున్ హడావిడి ఎక్కువగా కనిపించింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ‘రుద్రమదేవి’ వల్ల రానా కు ప్రేత్యేకంగా ఒరిగేది ఏమిలేదు అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: