‘బాహుబలి 2’ షూటింగ్ ప్రారంభం విషయమై ఇప్పటికీ సరైన క్లారిటీ లేకపోవడంతో ‘బాహుబలి 2’ విడుదల 2016 లో ఉండకపోవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘బాహుబలి’ బంధం నుండి ప్రభాస్ ఎప్పటికి బయట పడతాడు అన్న టెన్షన్ ప్రభాస్ అభిమానులలో రోజురోజుకు పెరిగి పోవడమే కాకుండా తమ ఆతృతను కొందరు స్వయంగా ప్రభాస్ ను కలిసి తమ సందేహాలను ప్రభాస్ వద్ద నుండి క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

‘బాహుబలి’ సినిమా వల్ల ప్రభాస్ కు జాతీయ మీడియాలో గుర్తింపు వచ్చి,నా ఇలా ఏకంగా రెండేసి సంవత్సరాల గ్యాప్ తో ఒకొక్క సినిమాను విడుదల చేస్తూ ఉంటే ప్రస్తుతం అనుక్షణం పెరిగిపోతున్న పోటీ వాతావరణంలో ప్రభాస్ వెనకపడే అవకాశం ఉందని 2017 దాకా ‘బాహుబలి 2’ విడుదల కాకపోతే ‘బాహుబలి’ వల్ల వచ్చిన క్రేజ్ అంతా ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఏర్పడి, అది ప్రభాస్ కెరియర్ కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ప్రభాస్ అభిమానులు చాలా విస్లేషణాత్మకంగా ప్రభాస్ కు క్లాస్ పీకుతున్నట్లు టాక్. 

అంతేకాదు ‘బాహుబలి 2’ విడుదలలోపు మరో సినిమాను పూర్తి చేసి విడుదల చేయమని ప్రభాస్ అభిమానులు తీవ్ర ఒత్తిడి పెంచారని వార్తలు వస్తున్నాయి. తన అభిమానుల సలహాలతో మనసు మార్చుకున్న ప్రభాస్ కూడ ఈ విషయమై రాజమౌళితో మాట్లాడి ‘బాహుబలి 2’ ఖచ్చితమైన షెడ్యూల్ వివరాలు తెలుసుకుని తాను ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రభాస్ తన అభిమానులకు సద్ది చెప్పి పంపినట్లు తెలుస్తోంది.  

ఈ వార్తలు ఇలా ఉండగా రాజమౌళి తన అమెరికా, కొరియా దేశాల పర్యటన ముగించుకుని ఈమధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. రేపు అనగా అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు వేడుకలు ‘బాహుబలి’ టీమ్ మధ్య జరగబోతున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ విషయమై ప్రభాస్ కు జక్కన్న నుండి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: