అoతర్జాతీయ మహానగరంగా అమరావతి నిర్మించాలని తన బావ చంద్రబాబు కలలకు మద్దతుగా నందమూరి సింహం బాలకృష్ణ కూడ రంగంలోకి దిగాడు. ప్రస్తుత పరిస్థుతలలో ఎంత భారీ సినిమా అయినా  రొటీన్ గా ప్రమోట్ చేస్తే జనాల దృష్టి ఆకర్షించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘డిక్టేటర్’ సినిమాను బాలయ్య డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. 

ఈసినిమా ముహూర్తం రోజునుంచి ‘డిక్టేటర్’ ను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న బాలకృష్ణ తన సినిమా ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా డిఫరెంట్ రూట్ ఎంచుకున్నాడు. అంతేకాదు ఎవ్వరూ ఊహించని విధంగా ఈసినిమా ఆడియో వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలు పెట్టేసారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో ‘డిక్టేటర్’ ఆడియో ఫంక్షన్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

బాలయ్య తెలుగు దేశ ప్రభుత్వoలో కీలక నేత  కావడంతో పొలిటికల్ గా ఆలోచించినా కూడా అమరావతిలో ఈ సినిమా ఆడియో వేడుక జరుపుకోవడం రాజకీయంగా కూడ కలిసి వస్తుందని బాలకృష్ణ ఈఎత్తుగడ వేసినట్లు టాక్. బాలయ్యకు తెలంగాణ కంటే ఏపీ  సీడెడ్ లోనే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ఉన్న విషయం తెలిసిందే. ఆరీత్యా  అమరావతిలో ఈ ఫంక్షన్ చేయడం అన్ని విధాల తనకు ఉపయోగ పడుతుందని బాలకృష్ణ ఎత్తుగడ. ఫిలింనగర్ లో వినబడుతున్నవార్తల ప్రకారం డిసెంబరు రెండోవారం లేదా మూడో వారంలో అమరావతిలో ‘డిక్టేటర్’ ఆడియో ఫంక్షన్ జరగవచ్చని సమాచారం. 

ఓ భారీ బహిరంగ ప్రదేశంలో పెద్ద సెట్టు వేసి  ‘బాహుబలి’ తరహాలో ఆడియో వేడుక చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అదేవిధంగా తెలంగాణ ప్రేక్షకులకు దూరం కాకుండా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తారట. ఏమైనా బాలయ్య అమరావతిలో రాజధని నిర్మాణం మొదలు కాకుండానే కట్టబోతున్న రాజధాని క్రేజ్ ను తన ‘డిక్టేటర్’ కు చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాడు దటీజ్ బాలయ్య.. 



మరింత సమాచారం తెలుసుకోండి: