“రుద్రమదేవి” కోసం 10 సంవత్సరాలు పరిశోధించి ఆస్తులు తాకట్టు పెట్టి  ఈ సినిమాను తీసిన గుణశేఖర్ కన్నా ఈసినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసిన అనుష్క కంటే గోన గన్నారెడ్డిగా నటించిన అల్లుఅర్జున్ కు విపరీతమైన పేరు రావడం వెనుక ఒక పెద్ద బిజినెస్ డీల్ నడిచింది అనే మాటలు విని పిస్తున్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘రుద్రమదేవి’ ని బి. సి. సెంటర్లలో రక్షించగలిగేది ఒక్క గోన గన్నారెడ్డి పాత్ర మాత్రమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

అసలు ఈ క్యారెక్టర్ ఇంత పవర్ ఫుల్ గా చెక్కడం వెనుక భారీ బిజినెస్ డీల్ జరిగింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథను కథలోని క్యారక్టర్లన్నింటికి మొదటిగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ వ్రాసినప్పుడు గోన గన్నారెడ్డి పాత్రకు ఇంత ప్రాధాన్యత లేదు అని టాక్. అయితే ఈసినిమా ఆర్ధిక సమస్యల మధ్య చిక్కుకున్నప్పుడు ఈ సినిమా తాలూకు విజువల్స్ చూసిన అల్లు అరవింద్ కేవలం గుణశేఖర్ కు ఫండింగ్ చేయడమే కాదు, తన కొడుక్కి ఇవ్వబోతున్న గోన గన్నారెడ్డి పాత్ర మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాలని కోరడంతో బన్నీ పాత్రకు ప్రాధాన్యత పెరిగిపోయి అప్పటి వరకూ అనుష్క పై చిత్రీకరించిన కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాలను తీసివేసారని టాక్. 

తెలంగాణ యాసలో అల్లుఅర్జున్ కోసం ప్రత్యేకంగా పంచ్ లు పేలే డైలాగులను వ్రాయడమే కాకుండా ఆ డైలాగ్స్ ను ఎలా పలకాలి అన్న విషయం పై తెలంగాణ యాస బాగా తెలిసిన కొందరి చేత అల్లుఅర్జున్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పంచ్ లన్నీ భారీ రేంజులో వర్కవుట్ కావడంతో  సినిమా చూసొచ్చిన 80% ఆడియన్సు అనుష్క కంటే ముందు అల్లు అర్జున్ పేరునే చెబుతున్నారు. 

‘గమ్మునుండవో’ అని బన్నీ పేల్చిన డైలాగ్ ఈసినిమా ఘన విజయానికి ఆయువు పట్టుగా మారింది అని అంటున్నారు. అందమైన తెలంగాణ రూరల్ లాంగ్వేజ్ ను ఈ పాత్రకోసం వాడుకున్న తీరు బి.సి. సెంటర్లలో గుణశేఖర్ కు కాసులు కురిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఈ తెలంగాణ మాండలికాన్ని కోస్తా ప్రాంతాలలోని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అన్న విషయం పై మాత్రమే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకుల అంచనా..  


మరింత సమాచారం తెలుసుకోండి: