తెలుగు ఇండస్ట్రీలో 2000లో ఉషాకిరణ్ మూవిస్ ద్వారా ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు తెజ. తక్కువ బడ్జెట్ అందరూ కొత్త వాళ్లతో మంచి హిట్ సాధించారు...ఈ సినిమాతోనే దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యారు. ఒక సినిమా చేస్తే దానివల్ల నాకు వ్యక్తిగత సంతృప్తి లభించడంతో పాటు ప్రేక్షకులు ఓ మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి కలగాలనే అంటారు దర్శకులు తేజ. ఇదే తరహా ప్రేమ కథా చిత్రాలు జయం, నువ్వు నేను వంటి హిట్ చిత్రాలు తీశారు.


తర్వాత తేజ తీసిన సినిమాలు అంతగా ఆడలేదు. అంతే కాదు ఒకే తరహా మూస చిత్రాలు తీస్తారన్న టాక్ ప్రేక్షకులకు వచ్చింది..ఈ విషయం స్వయంగా ‘హోరాహోరి’ ఆడియో ఫంక్షన్లో తేజ అన్నారు. వాస్తవానికి నేను ఎలాంటి సినిమా తీసినా ఆసినిమాపై ‘జయం’ ప్రభావం ఉంటుంది..అసలు ఆ పేరు వింటేనే నాకు ఇరిటేషన్ వస్తుందని చెప్పారు. దిలీప్, దక్ష జోడిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మాతగా హొరా హొరీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో తేజ చాలా అసహనానికి గురయ్యారు..దీంతో టాలీవుడ్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు.


ఆ మద్య శ్రీమంతుడు సినిమాతో చాలా మంది ప్రభావం అయ్యారు..తాము కూడా ఊర్లు దత్తత దీసకుంటామని కొంతమంది సినీ సెలబ్రెటీలు ముందుకు రావడంపై తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వారు ఊరికే దత్తత తీసుకోవడం లేదని ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామంటేనే ఇతరహా పనులకు సిద్దమయ్యారని వ్యాఖ్యలు చేశారు.  దీనిపై మహేశ్, ప్రకాష్ రాజ్, వివిధ నటులు మండిపడుతున్నారు. తమకు సోషల్ రెస్పాన్స్ లో భాగంగానే చేస్తున్నామని తేజనే సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. తర్వాత ‘నిజం’ సినిమాని మహేష్ తో కాకుండా ఉదయ్ కిరణ్ లేదా నితిన్ తో తీసి ఉంటె ఇప్పడు తన పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన చేసిన కామెంట్స్ అప్పుడు ఇండస్ట్రీలో తీవ్రదుమారం రేపింది.


మహేష్ బాబు, ఎన్టీఆర్


ఇప్పుడు తేజ జూనియర్ ఎన్టీఆర్ పై పడ్డారు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో తనకు కుదరితే మహేష్ బాబుతోనైనా సినిమా తీస్తాను కానీ ఎన్టీఆర్ తో సినిమా తీయను అని అన్నారు..ఎందుకంటే ఎన్టీఆర్ ప్రతి సినిమా తూకం వేసినట్లు గా డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా ఆయనకు నచ్చినట్లుగానే వెళ్తాడు..ఎవరి మాట వినరు ఆయనతో చేయడం కష్టం తనతో  సినిమా చేసే శక్తి నాకు లేదని ఆయన తెలిపారు. అంతే కాదు తాను ఇప్పటి వరకు బాహుబలి సినిమా చూడలేదని చెప్పారు. సినిమా హిట్ కాకపోతే మటుకు ఇంత డిప్రేషన్ కి లోను కావడం ఏంటా అని టాలీవుడ్ వర్గాల గుస గుస.

మరింత సమాచారం తెలుసుకోండి: