ధర్శక ధీరుడు రాజమౌలి ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇక బాహుబలి అయితే ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాను చాటి చెప్పాయి. అయితే ఇంతటి గొప్ప మంత్రదండం కలిగిన మన జక్కన సినిమాను చెక్కడంలో ఓ గొప్ప చిత్ర కారుడు. అయితే ప్రస్తుతం బాహుబలి బిగినింగ్ తో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో తాను ఒకడని ప్రూవ్ చేసుకున్న రాజమౌలి తన డ్రీం ప్రాజెక్ట్ ఈ మధ్య బయటపెట్టాడు.


ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న రాజమౌలి మీ చిరకాల వాంచ ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మహాభారతం తీయడమే తన జీవిత ఆశయం అని. తను ఊహించింది ఊహించి నట్టుగా కనుక సినిమా తీస్తే 'దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్' అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు కొట్టే హిట్ సినిమాలన్నీ ఆ సినిమాకు మెట్ల లాంటివని అన్నారు. సినిమా అంటే తనకున్న ఫ్యాషన్ ఏంటో ఆయన తీసిన సినిమాల ద్వారానే ప్రేక్షకులందరికి తెలియచేశాడు జక్కన్న. ఓటమెరుగని ధీరుడిలా సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రాజమౌలి మహాభారతం తెరకెక్కిస్తే ఇక ఆ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి.


చరిత్రలో మిగిలిపోయే సినిమాలు చాలా తక్కువ మందే తీస్తారు అలాంటి గొప్ప దర్శకుల జాబితాలో ఖచ్చితంగా రాజమౌలి ఉంటాడనడంలో సందేహం లేదు. రాజమౌలి మహాభారతం గురించి చెప్పిన దాన్ని చూస్తే ప్రేక్షకులెవరు దాన్ని తట్టుకోలేరనే మాట మాత్రం వాస్తవం.  


మరి అలాంటి అద్భుత కళాఖండం ఎప్పుడు ఆవిష్కృతమవుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటి చెబుతూ సినిమా వారినందరిని ఊరిస్తూ ఆశపెట్టే అకాడెమీ అవార్డు కూడా అతి త్వరలోనే రాజమౌలికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. దానికి పూర్తి అర్హత కూడా మన జక్కన్నకు ఉంది. సో ఈరోజులానే ఎన్నో మధురానుభూతులు, సూపర్ హిట్లు ఉన్న పుట్టినరోజులు మరెన్నో.. ఇంకెన్నో.. జరుపుకోవాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క సిని ప్రేక్షకుడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: