సినిమాకు కథ అనేది ఎంత అవసరమనేది మనకు తెలిసిన విషయమే కాని ఈ మధ్య సినిమాలు చూస్తే అదే కథలను తిప్పించి మళ్లించి సినిమాలు తీస్తున్నారు తప్ప కొత్త కథలను ఆలోచించాలనే విషయాన్ని కూడా మర్చిపోయారు. సినిమా అంటే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మాధ్యమమే అయినా సినిమా ద్వారా ఎంతో కొంత మంచిని గ్రహిస్తే బెటర్. ఏమన్నా అంటే ఇండస్ట్రీలో కథల కొరత చాలా ఉందని రంకెలేస్తారు.


అసలు కథల కొరత ఎక్కడున్నదండి.. ఒక్కసారి కృష్ణా నగర్ కు వచ్చి ఏ దర్శక నిర్మాత అయినా టచ్ చేసి చూడమనండి.. అక్కడ గల్లికో అద్భుత కథ దొరుకుతుంది. సినిమా పరిశ్రమలో మంచి దర్శకుడిగా.. మంచి రచయితగా ఉండాలని ఎన్నో ఆశలతో ఇక్కడ ఎవరు పరిచయం లేకపోయినా సరే వారి మీద వారికున్న నమ్మకంతో వచ్చేస్తున్నారు కళాకారులు. అయితే ఇక్కడ సాయం చేసే వాడి కన్నా ఏమీ తెలియక వచ్చిన ద్వారా లబ్దిపొందే సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి.


కొత్తగా ప్రయత్నించే వీలు లేక అవే సినిమాలను మళ్లీ మళ్లీ తీయడం తప్ప.. కథలు ఎందుకు దొరకవండి తెలుగు సిని చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో సినిమాను అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దాలనే ఎన్నో కలలు కనుకుంటూ.. ఏదో ఒకరోజు తమకు అవకాశం రాకుండా పోద్దా అని ఎదురుచూసే ప్రతి ఒక్క సినిమా రచయిత దర్శకుడికి ఒక్క అవాకాశం ఇచ్చి చూడండి. నిజంగానే సినిమా అంటే ఎలా ఉంటుందో వారి కసి తోనే చూపిస్తారు. 


దర్శకుడవ్వాలని కృష్ణా నగర్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు మంచి సినిమా అవకాశం రావాలను కోరుకుంటూ.. సినిమా అనేది ఒక పిచ్చి అది ఒక్కసారి అంటిందంటే చచ్చేదాకా వదలని చాలా మంది చెప్పారు.. ఇప్పటికి దాన్ని రుజువు చేస్తూ కనిపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: