రాజమౌలి ఏదన్న విషయం చెప్పాడంటే దానిలో అర్ధం ఏదో ఉంటుందని అందరికి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' సినిమా ఆడియో వేడుకలో అతిథిగా పాల్గొన్న రాజమౌలి సినిమా దర్శకుడు జగదీశ్ ని కంగ్రాట్యులేట్ చేస్తూ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. సినిమాకు మ్యూజిక్ పెద్దన్నయ్య కీరవాణి ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. నవీన్ చంద్ర, లావణ్యలది నైస్ పెయిర్ అని.. లావణ్య స్మైల్ తనకు చాలా ఇష్టమని అన్నాడు.


ఇక రాజమౌలి మారుతున్న మ్యూజిక్ సిస్టెం గురించి మాట్లాడాడు.. ఏదో రెండు మూడు నెలలు విని అవతల పడేసేలా ఇప్పటి సినిమాల మ్యూజిక్ క్వాలిటీ లెవల్స్ ఉంటున్నాయని.. వెల్ రికార్డ్స్ మ్యూజిక్ దర్శకుడు ఎలాంటి మ్యూజిక్ ని ఇస్తాడో అలాంటి మ్యూజిక్ నే ఎప్పటికీ ఉండేలా క్వాలిటీతో ఇస్తున్నారని అన్నాడు. అది వారి ఫ్యామిలీ నుండి వస్తున్నందుకు తనకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందని అన్నాడు.


లచ్చిందేవికి ఓ లెక్కుంది ఆడియో వేడుకలో రాజమౌళి :


ఇక సినిమా దర్శకుడు జగదీశ్ మంచి టాలెంటెడ్ డైరక్టర్ అని.. తన సినిమాలు మగధీరా.. ఈగ..మర్యాద రామన్న సినిమాలకు డైరక్షన్ టీంలో తను యాక్టివ్ గా పనిచేశాడని అన్నారు. ఈ సినిమా అందరికి లక్కీ అయ్యి లచ్చిందేవి కురిపించాలని అన్నారు. సో ఆడియో క్వాలిటీ రాజమౌలిని అంతలా ఇబ్బంది పెట్టాయన్న సంగతి రాజమౌలి మాటల్లో అర్ధమైంది. ఇంతకీ రాజమౌలిని ఇబ్బంది పెట్టిన ఆ మ్యూజిక్ కంపెనీ ఏదో మాత్రం చెప్పలేదు.


సహాయక దర్శకుల సినిమాలకు వచ్చి విష్ చేసి ఆ సినిమాల సక్సెస్ ని కోరడం చాలా తక్కువ మంది అగ్ర దర్శకులు చేసే పని.. కాని జక్కన్న మాత్రం తన శిష్యుల్లో ఎవరు దర్శకుడిగా అవకాశం వచ్చినా వారికి దగ్గరుండి విష్ చేస్తాడు. మరి రాజమౌలి ఆశీస్సులతో వస్తున్న ఈ లచ్చిందేవికీ ఓ లెక్కుంది సినిమా ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: