అమెరికాలో తెలుగు జాతి ఐక్యత మరోసారి నిరూపించారు. దేశం కాని దేశం వెళ్లితే అక్కన మన తెలుగు వాళ్లకు ఏవైనా సమస్యలు తలెత్తితే తెలుగు సంఘం నాట్స్ ముందుకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన నాట్స్ బృందం కృష్ణమూర్తి సూరె కుటుంబాన్ని ఆర్థిక సహాయంతో ఆదుకుంది. న్యూజెర్సీ ఎడిసన్ లో సాఫ్ట్ వేర్ కంపనీలో చేస్తున్న సూరె క్యాన్సెర్ తో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కృష్ణమూర్తి మరణంతో అగమ్యగోరచంగా తయరైంది ఆయన కుటుంబం దీంతో నాట్స్ సూరె కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. మానవతా వాదులు సూరె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని పిలుపునివ్వగా దాతలు కలిసి వచ్చి 62,789 డాలర్లు విరాళాన్ని చెక్కు రూపంలో కృష్ణమూర్తి సూరె భార్య కుమారి కి అందించారు. ఈ మొత్తాన్ని పిల్లల చదువుకు భవిష్యత్ కు ఉపయోగిస్తానని ఆమె తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: