భారత దేశంలో చదువుకునే విద్యార్థులు విదేశాల్లో పై చదువులు చదివి తమ బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని ప్రతి విద్యార్థికి ఉంటూంది. కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల తమ కలలు నెరవేర్చుకోలేక పోతుంటారు.   ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో చదవాలని ఎదురుచూస్తున్న భారత విద్యార్థులకు ఓ శుభవార్త..!  బ్రిటీష్ కౌన్సిల్ 150 మిలియన్ రూపాయల స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్-ఇండియా పేరుతో ఆయా దేశాల్లోని 45 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదవే భారత విద్యార్థులకు అందిస్తామని కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ మియీ క్వెయీ బుధవారం వెల్లడించారు.

ఐటీ తదితర రంగాల్లోని 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ల్లో 291 మంది భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఈ వివరాలను వెల్లడించారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లోని 45 యూకే ఇన్‌స్టిట్యూట్స్‌లో అభ్యసించే వారికి స్కాలర్‌షిప్‌లు దక్కనున్నాయని చెప్పారు.

సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు దృఢపడాలన్న ఉద్దేశంతో ‘గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్-ఇండియా 2016’ ప్రవేశపెట్టినట్లు వారు వివరించారు.సైఫాబాద్‌లోని కౌన్సిల్‌లో బుధవారం గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్-ఇండియా లోగోను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ ఆండ్రూ మెక్‌అల్లిస్టర్ ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: