భారత దేశ సంతతికి చెందిన చాలా మంది విదేశాల్లో మంచి పదవుల్లో కొనసాగుతున్నారు. తాజాగా కెడాలో భారతీయ సంతతికి చెందిన కెనడా తొలి సిక్కు రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ కి ఆదేశ పార్లమెంట్ లో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే..హర్జిత్ సజ్జన్ కుటుంబ సభ్యులు తన ఐదవ ఏట కెనడా వెళ్లి స్థిరపడ్డారు. . 45 ఏళ్ల హర్జిత్ సజ్జన్ భారత్ లోనే పుట్టారు. ఆయన కెనడా సైన్యంలో అపారమైన అనుభవం ఆయనకుంది. బోస్నియా, కాందహార్, అఫ్గానిస్థాన్లలో తీవ్రవాదులతో పోరాడిన యోధుడిగా ఆయనకు పేరు.

ఆయనకు గల అనుభవానికి గుర్తింపుగా ప్రధాని జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో రక్షణమంత్రిగా నియమించి గౌరవించారు.గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో హర్జిత్ సజ్జన్ కు చెందిన లిబరల్ పార్టీకి అధికారం దక్కింది. ఈ సందర్భంగా  హర్జిత్ ఒక అంశంపై పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యుడు, మాజీ రక్షణ మంత్రి అయిన జాసన్ కెన్నీ హఠాత్తుగా హర్జిత్ మాటలకు అడ్డుపడుతూ ఆయన  భాష తమకు అర్థం కావడం లేదని, సభలోని సభ్యులకు ఇంగ్లిష్ నుండి ఇంగ్లిషుకు తర్జుమా చేసి వివరించే అనువాదకుడు అవసరమని చెప్పారు.

జాసన్ కెన్నీ వ్యాఖ్యలకు  లిబరల్ పార్టీ సభ్యులు తప్పుపట్టారు హర్జిత్ ను అవమాన పరిచే విధంగా ఉన్నాయని అన్నారు.  వెంటనే దీటుగా బదులిచ్చారు. ఇది జాత్యహంకారమేనని ఆయనపై విరుచుకుపడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: