భారత దేశంలో గత కొంత కాలం నుంచి పెళ్లిళ్లు మ్యాట్రిమొనీ సైట్ ద్వారా జరిగిపోతున్నాయి. ఒకప్పుడు వివాహమంటే ఇరువురు పెద్దలు ఇరు కుటుంబాల బాగోగులు తెలుసుకొని ఒక నిశ్చయానికి వచ్చి పెళ్లి కుదిర్చే వారు. అలాంటి వివాహబంధాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. ఇక భారత దేశంలో ఈ మద్య డేటింగ్ కల్చర్ ప్రాచుర్యంలోకి వస్తుంది. మనసుకు నచ్చిన వారితో నచ్చినంత కాలం ఉండటం నచ్చకపోతే విడిపోయి వేరేవారిని చూసుకోవడం కామన్ అయ్యింది.

మరో వైపు తమ కూతురు కి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందంటే ఎగిరి గంతేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే అవి కూడా చాలా వరకు ఫెల్యూర్ అవుతున్నాయి. తాజాగా తాజాగా మ్యాట్రిమొనీ సైట్లు వచ్చిన తరువాత వివాహం తంతు మరింత అపహాస్యమవుతోంది. ఇలా మ్యాట్రిమొనీ సైట్ ద్వారా పరిచయమైన అమ్మాయితో మాట కలిపి, ప్రేమించినట్టు నాటకమాడి, వివాహం చేసుకున్న యువకుడు పెళ్లైన మూడు రోజులకే ఆమెకు చెప్పాపెట్టకుండా బిచాణా ఎత్తేసి, యూకే వెళ్లిపోయాడు.

లక్షలకు లక్షలు పోసి అమ్మాయికి కట్నా కానుకలు ఇచ్చి తీరా ఇలా మోసపోయిన తల్లింద్రులు కడుపు తరుక్కు పోతుంది. దీంతో వరంగల్ జిల్లాకు చెందిన ఆ యువతి డీజీపీని ఆశ్రయించింది. దీంతో ఎల్బీ నగర్ కు చెందిన శ్రవణ్ అనే ఈ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: