అమెరికాలో అధ్యక్ష పదవి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు తమ మద్దతు ఇవ్వాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రముఖ డెమోక్రటిక్‌ నేతలను ప్రైవేటుగా కోరినట్లు సమాచారం. మరోవైపు ప్రపంచంలో అమెరికా ప్రతిష్ఠను డొనాల్డ్‌ ట్రంప్‌ నాశనం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా మండిపడ్డారు. మహిళలు, మైనారిటీలకు వ్యతిరేకంగా అసభ్య విచ్చిన్న భాషను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.దీనిపై ఆయన సభల్లో నిరసనలు, హింస చోటుచేసుకుంటున్నా రిపబ్లికన్‌ పార్టీలో చలనం లేదని విమర్శించారు.

ఇక  హిల్లరీ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ రేసులో ముందంజలో ఉన్న సంగతి తెలిసింది. డెమోక్రాట్లు అంతా హిల్లరీకి మద్దతుగా నిలిస్తే ఆమే పార్టీ నామినీగా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఒబామా పేర్కొన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.హిల్లరీ కూడా డొనాల్డ్‌పై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష అభ్యరిత్వ రేసులో ఉన్న వ్యక్తి కోటిమందికిపై గాగల వలసపౌరులను చట్టుముడుతున్నారు. ముస్లింలపై వ్యాఖ్యలతో హింసను మరింత ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ 


ప్రసుత్తం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల్లో హిల్లరీ క్లింటన్‌కు సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ పోటీగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో చాలా చోట్ల హిల్లరీనే గెలుపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒబామా డెమోక్రటిక్‌ పార్టీ నామినీగా ఎవరికీ ప్రాధాన్యంఇవ్వలేదని అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జోష్‌ ఎర్నెస్ట్‌ వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: