అమెరికా అధ్యక్ష పదవిలో దూసుకుపోతున్న ట్రంప్ మరోసారి వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి నోటి దూలతోనే ఆకట్టుకుంటున్న ఈ పెద్ద మనిషి ఈసారి పొరుగుదేశాన్ని టార్గెట్ చేశారు. వాణిజ్య, వ్యాపార, సాంకేతిక రంగాల్లో అమెరికాకు దీటుగా రాణిస్తున్న చైనాపై ట్రంప్ ఘాటుపదజాలంతో విరుచుకుపడం విశేషం. 

చైనా-అమెరికాల వాణిజ్య సంబంధాలపై ట్రంప్ మాట్లాడుతూ ఇకపై అమెరికాను చైనా రేప్ చేస్తుంటూ చూస్తూ ఊరుకోనని కామెంట్ చేశారు. ఇటీవలి కాలంలో చైనా ప్రపంచ మార్కెట్ ను శాసిస్తున్న సంగతి తెలిసిందే. మేడిన్ చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అతి చవకగా లభిస్తున్న వీటి ధాటికి వివిధ దేశాల మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. 

చైనా డ్రాగన్ దెబ్బ చివరకు అమెరికాను సైతం తాకింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తుల ఎగుమతులకు పోటీ పెరగాలనే ఉద్దేశంతో చైనా ఇటీవల తన కరెన్సీ విలువను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలను ట్రంప్ తన తాజా ప్రచారంలో అస్త్రాలుగా వాడుకున్నారు. అమెరికా వాణిజ్యాన్ని చైనా చంపేస్తుందని.. చైనా కంటే అమెరికా చాలా శక్తివంతమైందని డొనాల్డ్ కామెంట్ చేశారు. 

అమెరికా అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇస్తే... ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా మారుస్తానని ఇండియానాలోని ఫోర్ట్ వేన్ నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ భరోసా ఇచ్చాడు. ఐతే.. తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని ముందే అవగాహన ఉన్న ట్రంప్.. కొన్ని ముందు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. వ్యక్తిగతంగా తనకు చైనాపై ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చాడు. అసమర్థులైన అమెరికా నేతలపైనే తన కోపమంతా అని ముక్తాయించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: